ఆంధ్ర లో రెండు మూడు రోజుల పాటు వర్షాలు
అమరావతి స్టూడియో భారత్ ప్రతినిధి
ఆంధ్ర లో రెండు మూడు రోజుల పాటు వర్షాలు
అమరావతి:
పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్‌కు హెచ్చరికలు జారీ చేసింది.అక్టోబరు 25న బంగ్లాదేశ్ తీరం దాటే అవకాశం ఉందని..
ఫలితంగా కోస్తాంధ్రలో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఈ వాతావరణ వ్యవస్థ సముద్రంలో బలహీనపడి బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ సమీపంలో తీవ్ర వాతావరణ వ్యవస్థగా మారే అవకాశం ఉంది. ఇది తీవ్ర తుఫానుగా మారి తీరం దాటే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రలో ప్రస్తుతం మేఘావృతమైన వాతావరణం, కోస్తా వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.
What's Your Reaction?