పొదుపు సొమ్మును కాజేస్తోన్న అక్రమార్కుల పై చర్యలు తీసుకోవాలి
పాయకరావుపేట స్టూడియో భారత్ ప్రతినిధి
డ్వాక్రా గ్రూపుల్లో పొదుపు సొమ్మును కాజేస్తోన్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి
పాయకరావుపేట:
డ్వాక్రా గ్రూపుల్లో పొదుపు సొమ్మును కాజేస్తోన్న గ్రూపు నాయకులు,వెలుగు ప్రోజెక్టు సిబ్బందిపై వెంటనే విచారణ చేపట్టి,ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత ఇందిరా కాలనీ శాంతి డ్వాక్రా గ్రూప్ సభ్యురాలు దువ్వాడ రమణమ్మ సుప్రీం కోర్టు న్యాయవాది వడ్లమూరి కృష్ణ స్వరూప్ కు సోమవారం ఫిర్యాదు చేశారు.
పట్టణంలోని పరివర్తన నిలయంలో కృష్ణ స్వరూప్ ను కలసిన ఆమె మాట్లాడుతూ...
తమ గ్రూపులో పొదుపు సొమ్ము సుమారు 1 లక్ష 80 వేలు రూపాయలును గ్రూప్ నాయకురాలు పెనుపోతుల ప్రభావతి,పల్లా అప్పయమ్మలు సొంత అవసరాలకు వాడుకున్నారని,బ్యాంకుకు సకాలంలో సొమ్ము జమచేయకుండా అవినీతి,అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
ఇది కూడా చదవండి... https://studiobharat.com/Read-the-solution-to-all-the-problems
ఈ విషయమై ప్రశ్నించిన తనను అన్యాయం గా గ్రూపు నుండి తొలగించారని అన్నారు.దీనిపై స్థానిక వెలుగు అధికారులు,గ్రూప్ సమన్వయ అధికారి ఎ.సి,సి.ఏ.,జిల్లా ప్రాజెక్ట్ పిడి,జిల్లా కలెక్టర్,ఎంపీడీఓ,పాయకరావుపేట పోలీస్ స్టేషన్ లకు ఫిర్యాదు చేసినా ఎవ్వరూ పట్టించికోలేదన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు.
ఈ విషయంపై సుప్రీంకోర్టు న్యాయవాది కృష్ణ స్వరూప్ స్పందిస్తూ...
డ్వాక్రా పొదుపు సంఘాల్లోని లక్షల రూపాయలు ప్రజల సొమ్మును గ్రూపు అధ్యక్షురాలు, కార్యదర్శి లను మభ్య పెట్టి డ్వాక్రా సమన్వయ వెలుగు ప్రాజెక్ట్ అధికారులు కాజేస్తున్నారని ఆరోపించారు.ప్రశ్నించిన గ్రూప్ లోని సభ్యురాలు ను వేధించి,అవినీతి కి పాల్పడుతున్నారని తెలిపారు.వెలుగు అధికారులు నేత్రుత్వం లోనే గ్రూప్ పొదుపు సొమ్ము ను దోచుకుంటున్నారని, ఇది పాయకరావుపేట మండలం లో జోరుగా సాగుతున్న బాగోతం అని విమర్శించారు.
ఇప్పటికైనా మహిళా డ్వాక్రా పొదుపు గ్రూప్ ల్లో జరుతున్న ఆర్ధిక అరాచకం, అవినీతి కార్యకలాపాలుపై జిల్లా కలెక్టర్,వెలుగు జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ లు న్యాయ విచారణ జరిపించాలని శాంతి గ్రూప్ సభ్యురాలు చేసిన పిర్యాదు పైన తక్షణమే చర్యలు చేపట్టాలని కృష్ణ స్వరూప్ డిమాండ్ చేసారు.లేని పక్షంలో అవినీతి కి పాల్పడుతున్న వారిపై కోర్టుల ద్వారా చర్యలు తీసుకొనేలా స్పందిస్తామని తెలిపారు.శాంతి మహిళా డ్వాక్రా గ్రూప్ సభ్యురాలు దువ్వాడ రమణమ్మకు న్యాయం జరిగేలే చూస్తామని కృష్ణ స్వరూప్ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో మాల మహానాడు అనకాపల్లి జిల్లా అధ్యక్షులు గారా జయబాబు,పార్టీ నాయకులు దువ్వాడ చంటిబాబు,మార్తి సింహచలం తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?