అన్ని సమస్యలకు పరిష్కారం చదువే
డల్లాస్ స్టూడియో భారత్ ప్రతినిధి
అన్ని సమస్యలకు పరిష్కారం చదువే - అందుకే విద్యకు అగ్రస్థానం
-ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాటా), డల్లాస్ లో ఆలూరు సాంబశివారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు.
ఇప్పటి తరానికి మంచి చదువు అందిస్తే భవిష్యత్తులో మన రాష్ట్రం అన్నిట్లోనూ అగ్రస్థానంలో ఉంటుంది అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి చెప్పారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాటా, డల్లాస్ లో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు.పేదరికం వల్ల ఏ ఒక్కరూ చదువుకు దూరం కాకూడదు అన్నదే జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం అని తెలిపారు.ఈ నాలుగేళ్లలో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారిపోయాయని,ఏ కార్పొరేట్ విద్యా సంస్థా అందించలేని అద్భుతమైన వసతుల మధ్య పేద పిల్లలు చదువుతున్నారని అన్నారు.విద్యా రంగంపైన పెట్టే ఖర్చు తక్షణమే ఫలితాలు ఇవ్వదని, ఇప్పటి విద్యార్థులందరూ భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకున్నాక ఆ ఫలాలు మనకు కనిపిస్తాయన్నారు.
ఇది కూడా చదవండి... https://studiobharat.com/A-huge-fish-caught-in-the-net
కొన్ని దశాబ్దాల నుంచి విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్లే ఈరోజు అమెరికా ఐరోపా దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కూడా సరిగ్గా అదే దూర దృష్టితో రాష్ట్రంలో విద్యకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన మొదలుకొని రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన అన్ని పథకాల గురించి సాంబశివారెడ్డి ప్రవాసాంధ్రులకు వివరించారు.
What's Your Reaction?