తరాలు మారిన అమ్మ కు తప్పని తిప్పలు

పాటి స్టూడియో భారత్ ప్రతినిధి

Jul 27, 2023 - 11:37
 0  106
తరాలు మారిన అమ్మ కు తప్పని తిప్పలు

తరాలు మారిన "అమ్మ"కు తప్పని తిప్పలు

మంచిర్యాల జిల్లా:

మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో ఓ గర్భిణి మహిళను ఆస్పత్రికి తరలించడానికి కుటుంబసభ్యులు,స్థానికులు అష్టకష్టాలు పడ్డారు.కోనంపేట పంచాయతీలోని పాటి గ్రామానికి చెందిన రెడ్డి మల్లక్క 7 నెలల గర్భిణి.

మూడు రోజుల నుంచి తీవ్రమైన జ్వరం రావడంతో స్థానిక ఆర్ఎంపీ వద్ద చికిత్స తీసుకుంది.అయినా ఆరోగ్యం కుదుట పడక పోవడంతోపాటు రక్త స్రావం కావడంతో ఆమెను బెల్లంపల్లిలోని ఆస్పత్రికి తరలించడానికి బుధవారం ఏర్పాట్లు చేశారు.

ఇది కూడా చదవండి..https://studiobharat.com/Heavy-rains-in-Telugu-states.. దయచేసి సబ్ స్రైబ్ చేసుకోండి.

పాటి గ్రామం నుంచి కోనంపేట వరకు రోడ్డు సౌకర్యం సరిగ్గా లేకపోవడంతో ఎడ్ల బండిలో పంచాయతీ కార్యాలయం వరకు అతి కష్టం మీద తీసుకెళ్లారు.అక్కడి నుంచి ఆటోలో ఎర్ర వాగును దాటించారు.అప్పటికే 108 అంబులెన్స్ ఎర్ర వాగు అవతల వైపు బురదలో చిక్కుకుంది.దీంతో స్థానికుల సాయంతో బురద నుంచి అంబులెన్స్‌ను వెలికి తీశారు.అనంతరం ఆమెను బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు...!!

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow