తెలుగు రాష్ట్రాలలో కుండపోత వర్షాలు

తెలుగు స్టేట్స్ స్టూడియో భారత్ ప్రతినిధి

Jul 26, 2023 - 12:57
 0  11
తెలుగు రాష్ట్రాలలో కుండపోత వర్షాలు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. నేటి నుంచి మూడు రోజులపాటు కుండపోత వర్షాలు.. లేటెస్ట్ వేదర్ రిపోర్ట్..

ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి.ఆవర్తనం అల్పపీడనంగా ఏర్పడి..రేపటికి..వాయుగుండంగా బలపడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

దాంతో..ఏపీలో మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.ఇవాళ కృష్ణా,ఎన్టీఆర్,గుంటూరు,పల్నాడు,బాపట్ల,ప్రకాశం,నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.మిగిలిన అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

రేపు అల్లూరి సీతారామరాజు,ఏలూరు,కృష్ణా,ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్నిచోట్ల మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.మిగిలిన అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురువనున్నాయి.అటు..రాయలసీమలోనూ పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

ఇది కూడా చదవండి..https://studiobharat.com/Will-you-volunteer-to-serve-Tirumala-Sriveera..

ఇప్పటికే హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది.వర్షాలకు జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజలు,వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.అయితే,తెలంగాణకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసిన వాతావరణ శాఖ..హైదరాబాద్‌కు ఆరెంజ్‌ అలెర్ట్‌ ఇచ్చింది.దీంతో..ఇవాళ హైదరాబాద్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బల్దియా హెచ్చరికలు జారీ చేసింది.లోతట్టు ప్రాంతాల్లో ఉండొద్దని నగరవాసులకు సూచించారు అధికారులు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow