అక్కా తమ్ముడి మధ్య సయోధ్య కుదిర్చి రాఖీ వేడుక
గొడవ పడి ఠాణాకు వచ్చిన అక్కాతమ్ముడి మధ్య సయోధ్య కుదిర్చి, రాఖీ వేడుక జరిపించిన వరంగల్ పోలీసులు
గొడవ పడిన అక్కాతమ్ముళ్లను రాఖీతో ఒక్కటి చేశారు వరంగల్ మిల్స్ కాలనీ ఎస్సై సురేశ్. కరీమాబాద్లో ఉండే పస్తం కోటమ్మ,ఆమె తమ్ముడు ఏడుకొండలు మధ్య వారసత్వ ఇంటి స్థలం విషయంలో గొడవ జరిగింది.చంపుతామంటూ ఒకరినొకరు బెదిరించుకున్నారు. దీనిపై కోటమ్మ శనివారం ఫిర్యాదు చేసేందుకు రాగా,ఏడుకొండలును పోలీసులు పిలిపించి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. ఆపై కోటమ్మతో ఏడుకొండలుకు రాఖీ కట్టించారు.
What's Your Reaction?