ప్రతి ఒక్కరు ఫైర్ సేఫ్టీని పాటించండి - స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కూచిపూడి శ్రీనివాసరావు 

జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి

Apr 10, 2025 - 14:02
 0  39
ప్రతి ఒక్కరు ఫైర్ సేఫ్టీని పాటించండి - స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కూచిపూడి శ్రీనివాసరావు 

ప్రతి ఒక్కరు ఫైర్ సేఫ్టీని పాటించండి - స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కూచిపూడి శ్రీనివాసరావు 

ఫైర్ సేఫ్టీని అశ్రద్ధ చేస్తే మూల్యం తప్పక చెల్లించాల్సిందే

వేసవి సెలవులలో విద్యార్థులు అవగాహన లేని ఈత వల్ల ప్రమాదాలు తెచ్చుకోవద్దు

జగ్గయ్యపేట 

జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రాంతంలో గల అగ్ని ప్రమాదం నివారణ శాఖ సేవలు ఘననీయమని చెప్పుకోవచ్చు.2024 మార్చి నెల నుండి 31 ఏప్రియల్ 2025 వరకు 135 అగ్ని ప్రమాదాలను నివారించ గలిగామని,తద్వారా సుమారు 40 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరగే ప్రమాదం నుండి 20 కోట్ల రూపాయల ఆస్తి నష్టాని అగ్నిప్రమాదం నుండి తగ్గించగలిగామని స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కూచిపూడి శ్రీనివాసరావు తెలియజేశారు.బహిరంగంలో 77,వ్యవసాయ భూములలో 45,ఇండ్లలో 15,అడవిలో 15,విద్యుత్ అఘాతాల వల్ల 14,బూదవాడ,వి.యస్.యన్ ల్యాబ్ ఫ్యాక్టరీ లలో జరిగిన ప్రధాన కేసులలో అగ్ని ప్రమాద మంటలను ఆర్పివేయడం జరిగిందని,రిస్క్యూ ప్రమాదాల నివారణ వల్ల 50 మంది ప్రాణాలను కాపాడటం జరిగిందని ఆయన తెలియజేశారు.ఇండస్ట్రీస్,హాస్పిటల్స్,మాల్స్,పాఠశాలలు,కళాశాలలో,కమర్షియల్ ప్రాంతాలలో అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ముందు ప్రభుత్వం నుండి ఫైర్ సేఫ్టీ అనుమతులు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరారు.

వీరు తప్పని సరిగ వేసవిలో అధిక ఉష్ణోగ్రతను దృష్టి లో పెట్టుకొని అగ్ని ప్రమాదాలు నివారించడానికి అందుబాటులో వాటర్,నీరు ని, పెట్రోల్ బంక్ లలో ఫోం ని ప్రతి చోట అందుబాటులో ఉంచుకోవాలని ఆయన తెలియజేశారు.పొలాలలో మంటల వల్ల ఇతర పంటలకు నష్టం కలగకుండా చూడాలని ఆయన రైతులకు తెలియజేశారు.బహిరంగ ప్రదేశాలలో,అటవీ ప్రాంతంలో వెలిగించిన సిగరెట్ గాని వెలిగించిన అగిపుల్లలను గాని చెత్త ఉన్న ప్రాంతాలలో విసిరివేయకూడదని ఆయన అన్నారు.లోడ్ కు మించి కరెంట్ ని వాడవద్దని,ఇతర దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కరెంట్ బోర్డు లో మెయిన్ ను,యంసిబి లను ఆపి వేయాలని అన్నారు.గ్యాస్ సిలెండర్ ని ఫుల్ బండ ఇంటి వచ్చినప్పుడు ఖచ్చితంగా మూత సీల్ తీసి లీకెజ్ లు ఏమైన ఉన్నాయని గమనించాలని,రెగ్యులేటర్ వద్ద గ్యాస్ రాకుండా ఆపి వేయాలని,రెండో ఫుల్ సిలెండర్ ఉంటే వేరొక గదిలో భద్రపరుచుకోవాలని,ఊరికి వెళ్ళేటప్పుడు మాత్రం సిలెండర్ వద్ద రెగ్యులేటర్ ని తొలగించి దాని మూతికి క్యాప్ పెట్టాలని ఆయన అన్నారు.ఫైర్ సేఫ్టీ మరియు ఫైర్ సేవల పట్ల అనుమానాలు ఉన్నా నివృత్తి చేసుకోవడానికి ఎప్పుడైన ఆఫీస్ కి వచ్చి తెలుసుకోవచ్చని ఆయన తెలియజేశారు.

మున్సిపాలిటీలో రెగ్యులర్ టౌన్ ప్లానింగ్ అధికారి ఉన్నారా  - https://studiobharat.com/Does-the-municipality-have-a-regular-town-planning-officer

అగ్ని ప్రమాదం వల్ల జరిగే నష్టాల కన్న ముందస్తుగా ప్రమాదాల నివారణ పై చర్యలు తీసుకొని ఆచరిస్తే ప్రమాదాలు పూర్తి స్థాయిలో నివారించ వచ్చిని ఆయన అన్నారు.వేసవి సెలవులలో అవగాహన లేని ఈత లకి వెళ్లి ప్రాణాలను బలి చేసుకోవడం కన్న కోచింగ్ వద్ద ఈత నేర్చుకొని ప్రాణాలను కాపాడుకోవాలని ఈ విషయంలో తల్లిదండ్రులు ఆలోచించుకోవాలని ఆయన హితవు కోరారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow