రెండు కేజీల గంజాయి పట్టుకున్న పోలీసులు

ఐదుగురు యువకులు అరెస్టు జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి

Jul 8, 2023 - 20:53
Jul 9, 2023 - 01:10
 0  77
రెండు కేజీల గంజాయి పట్టుకున్న పోలీసులు

రెండు కేజీల గంజాయి పట్టుకున్న పోలీసులు

ఐదుగురు యువకులు అరెస్టు

జగ్గయ్యపేట

ఎన్టీఆర్ జిల్లా సిటీ పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఐపియస్ ఆదేశాల మేరకు,రూరల్ డిసిపి వి.అజిత ఐపియస్ మరియు నందిగామ ఎసిపి కె.జనార్ధన్ నాయుడు ఆధ్వర్యంలో జగ్గయ్యపేట పట్టణం పోలీస్ స్టేషన్ నందు సిఐ యం జానకి రామ్,యస్ఐ బివి.రామారావు గంజాయి అమ్ముతున్న స్థావరాల పై స్పెషల్ రైడ్ ల ను చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఉదయం 6 గంటల సమయంలో రెండు కేజీల గంజాయిని క్రిస్టియన్ పేట సమాధుల వద్ద తెలిసిన సమాచారం మేరకు సిబ్బంది తో కలసి వెళ్లి గంజాయి త్రాగుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారించారు.

ఇది కూడా చదవండి...https://studiobharat.com/Falak-Nama-Super-Fast-Train-caught-fire

విచారణలో భాగంగా వారి వద్ద నుండి రెండు కేజీల గంజాయిని పట్టుకున్ని కేసు నమోదు చేసినట్లు నందిగామ ఎసిపి కె జనార్థన్ నాయుడు ప్రెస్ మీట్ ద్వారా తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగ్గయ్యపేట పట్టణంలో ఇప్పటికే గంజాయి నివారించడానికి యువతకు అవగాహన కల్పించడం జరిగింది.సమాజంలో యువత గంజాయి లాంటి చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా యువత వారి తల్లిదండ్రులు సైతం ప్రత్యేక పర్యవేక్షణ చేసుకోవాలని ఆయన అన్నారు.

ఎక్కడైన గంజాయి మరియు చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే దగ్గర లో ఉన్న పోలీసు వారికి తెలియజేయగలరని,అట్ల తెలిపిన వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఆయన అన్నారు.ఈ సందర్భంగా పెట్టుకున్న రెండు కేజీల గంజాయిని మీడియా వారికి చూపించడం జరిగింది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow