మహిళా దినోత్సవం సందర్భంగా మహిళ శక్తి బస్సులను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి!
హైదరాబాద్ స్టూడియో భారత్ ప్రతినిధి

మహిళా దినోత్సవం సందర్భంగా మహిళ శక్తి బస్సులను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి!
హైదరాబాద్:-
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా శక్తి ఆర్టీసీ బస్సులను ఘనంగా ప్రారంభించారు.ఈ బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల అవసరాలకు ఉపయోగపడనున్నాయి. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సహా పలువురు ప్రజాప్రతినిధులు, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఆర్టీసీ బస్సులను మహిళల కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ లోని పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద ఈ బస్సులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.తెలంగాణ రాష్ట్రంలోని మహిళా సంఘాల కోసం ప్రత్యేకంగా అద్దె బస్సులు నడపనున్నట్టు ఆయన ప్రకటించారు.ఈ కొత్త మహిళా శక్తి బస్సులు మహిళా సంఘాలకు ప్రోత్సాహకంగా ఉంటాయని,ప్రజా పరిపాలనలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు.
డ్వాక్రా స్వయం సహాయక బృందాలకు సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఈ సందర్భంగా,స్వయం సహాయక బృందాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న 64,000 మెగా వాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.పర్యావరణ హితంగా సాగరహిత విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రారంభించింది.అంగన్వాడీ కార్యకర్తలు,హెల్పర్ల నియామకాలు మరోవైపు,రాష్ట్రంలోని అంగన్వాడీల్లో 14,000 మంది కార్యకర్తలు, హెల్పర్ల పోస్ట్ ల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
కన్ఫర్మ్ టికెట్ ఉంటేనే రైల్వే స్టేషన్లోకి ఎంట్రీ! - https://studiobharat.com/Entry-into-the-railway-station-only-with-a-confirmed-ticket
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరా మహిళా శక్తి పాలసీ ఆవిష్కరించారు.ఈ పాలసీ ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబనను పెంపొందించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వెల్లడించారు.తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారత,ఆర్థిక వృద్ధి,పర్యావరణ పరిరక్షణ లాంటి అంశాలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
What's Your Reaction?






