భారత్ లో యూట్యూబర్లకు షాక్
స్టూడియో భారత్ ప్రతినిధి

భారత్ లో యూట్యూబర్లకు షాక్.. 29 లక్షల వీడియోలు,48 లక్షల ఛానెళ్ల తొలగింపు
యూట్యూబ్..దీని గురించి తెలియని వారంటూ ఉండరు.చిన్నారుల నుంచి పెద్దల వరకు యూట్యూబ్ వాడంది ఉండరు.తాజాగా భారతదేశంలో యూట్యూబ్ సంచలన నిర్ణయం తీసుకుంది.29 లక్షల వీడియోలు,48 లక్షల ఛానెళ్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.వీడియో కంటెంట్ పాలసీకి సంబంధించి YouTube పెద్ద చర్య తీసుకుంది.యూట్యూబ్ దాని ప్లాట్‌ఫామ్ నుండి 9.5 మిలియన్లకు పైగా వీడియోలను తొలగించింది.కంటెంట్ ఉల్లంఘన కారణంగా Google వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ఈ వీడియోలను తీసివేసింది.
అదే సమయంలో అక్టోబర్-డిసెంబర్ 2024 మధ్య యూట్యూబ్ కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు భారతదేశంలోని ప్లాట్ ఫారమ్ నుండి 2.9 మిలియన్లకు పైగా (29 లక్షలు) వీడియోలు తొలగించింది.మార్గదర్శకాలను పాటించని ప్లాట్‌ఫారమ్‌లోని వీడియోలను గుర్తిస్తుంది.తొలగించిన వీడియోలలో ఎక్కువగా పిల్లలను ప్రమాదంలో పడేసే విన్యాసాలు,వేధింపులు వంటి కంటెంట్ ఉన్నట్లు గుర్తిచింది.
మహిళా దినోత్సవం సందర్భంగా మహిళ శక్తి బస్సులను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి! - https://studiobharat.com/CM-Revanth-Reddy-launches-Mahila-Shakti-buses-on-Womens-Day
ఈ కంటెంట్ తమ విధానానికి విరుద్ధమని యూట్యూబ్ పేర్కొంది. వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్ నుండి తొలగించబడిన కంటెంట్ లో ద్వేషపూరిత ప్రసంగం,పుకార్లు,వేధింపులకు సంబంధించిన వీడియోలు ఉన్నాయి.యూట్యూబ్ వీడియోలను తొలగించడమే కాకుండా,దాని ప్లాట్ ఫామ్ నుండి 4.8 మిలియన్లకు పైగా అంటే 48 లక్షల ఛానెల్‌లను కూడా తొలగించింది. ఈ ఛానెల్ లు స్పామ్ లేదా మోసానికి సంబంధించిన వీడియోలను అప్ లోడ్ చేస్తున్నాయని యూట్యూబ్ చెబుతోంది.
What's Your Reaction?






