హోళీ కానుక గా గిరిజన మహిళలకు స్టీల్ గిన్నె లు పంపిణీ - వాసవీ సేవా సమితి జిల్లా అధ్యక్షులు యన్నాకుల రాంబాబు 

జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి

Mar 14, 2025 - 13:43
Mar 14, 2025 - 13:46
 0  166
హోళీ కానుక గా గిరిజన మహిళలకు స్టీల్ గిన్నె లు పంపిణీ - వాసవీ సేవా సమితి జిల్లా అధ్యక్షులు యన్నాకుల రాంబాబు 

హోళీ కానుక గా గిరిజన మహిళలకు స్టీల్ గిన్నె లు పంపిణీ

-  వాసవీ సేవా సమితి జిల్లా అధ్యక్షులు యన్నాకుల రాంబాబు 

జగ్గయ్యపేట 

జగ్గయ్యపేట పట్టణం లో మణికంఠ స్ట్రీల్ ఎంపోరియం అధినేత,జిల్లా వాసవి సేవా సమితి అధ్యక్షుడు యన్నాకుల రాంబాబు దంపతులు హోలీ పండుగ సందర్భంగా గిరిజన మహిళకు శుభాకాంక్షలు తెలిపారు.యన్నాకుల రాంబాబు దంపతులు మనవడు శ్రీతన్ చేత స్వీట్స్ ,స్టీల్ గిన్నెలు అందచేశారు.గిరిజన మహిళలు సంతోషంగా చప్పట్లు, ఈలలు, సంప్రదాయ నృత్యాలు,పాటలు పాడుతూ, కేరింతలు తో ఆనందం వ్యక్త చేసారు.

హోలీ పండుగ సందర్భంగా గత 13 సంవత్సరాలుగా స్టీల్ వస్తువులను జగ్గయ్యపేట చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన గిరిజన మహిళలకు హోళీ కానుకగా అందచేస్తున్నట్లు రాంబాబు తెలిపారు.ముఖ్య అతిథిగా ఏపియంపిఏ జిల్లా అధ్యక్షులు కాకరపర్తి వెంకట రమేష్,ఏపియంపిఏ జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణపు సూర్య ప్రకాష్ లు కలిసి స్టీల్ గిన్నెలు పంపిణీ ని ప్రారంభించారు.బాలా త్రిపురసుందరీ పీఠం వ్యవస్థాపకులు కోసూరి వెంకటే శ్వరరావు (బాబు స్వామి) గురూజీ అమ్మవారి ఆశీస్సులు అందజేశారు.

భారత్‌ లో యూట్యూబర్లకు షాక్‌ - https://studiobharat.com/Shock-for-YouTubers-in-India

వాసవి సేవా సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాకరపర్తి సోమేశ్వరరావు, యన్నాకుల అభిరామ్, మణికంఠ ఎన్టీఆర్ జిల్లా గౌరవ అధ్యక్షులు పేరూరి నరసింహ రావు, సెక్రటరీ పెనుగొండ రామ కృష్ణ , ట్రెజరర్ కంభంపాటి రవికుమార్,జిల్లా యూత్ ప్రెసిడెంట్ చౌట రమేష్,తదితరులు రాంబాబు కుటుంబ సభ్యులు ఔదార్యాన్ని ప్రశంసించారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow