బ్యాంక్‌లో రైతు తాకట్టు పెట్టిన బంగారం మాయం
రాజుపేట స్టూడియో భారత్ ప్రతినిధి
బ్యాంక్‌లో రైతు తాకట్టు పెట్టిన బంగారం మాయం..?
ములుగు జిల్లా రాజుపేట
కెనరాబ్యాంక్‌లో తాకట్టు బంగారం మాయమైన విషయం సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వ్యవసాయం నిమిత్తం పలువురు రైతులు సదరు శాఖలో బంగారం తాకట్టు పెట్టుకుని రుణం తీసుకు న్నారు.కోటి 38 లక్షల విలువ చేసే దాదాపు రెండు కిలోల మేర బంగారంను బ్యాంక్ అప్రైజర్ కొట్టేసి నట్లు వార్షిక ఆడిట్‌లో అధికారులు గుర్తించారు.
Follow the STUDIOBHARAT channel...
https://youtu.be/gsBU7NUQ6Z8?si=Kl6dUCyZjjtS0lzi .... దయచేసి అప్ డేట్స్ న్యూస్ కోసం జాయిన్ గ్రూప్ & సబ్ స్రైబ్ చేసుకోండి..
బ్యాంకులోని నిల్వలకు...
తాకట్టు లెక్కలకు పొంతన లేకపోవడంతో బ్యాంక్ మేనే జర్ దృష్టికి తీసుకెళ్లారు.దీoతో వెంటనే మేనేజర్...బ్యాంక్ అప్రైజర్‌ను సంప్ర దించేందుకు ప్రయత్నం చేయగా...ఆయన అప్పటికే గ్రామం విడిచి భార్య, పిల్లలతో ఉడాయిం చినట్లు తెలుస్తోంది.
ఇదే విషయమై మంగపేట పోలీసులకు బ్యాంక్ మేనే జర్ ఫిర్యాదు చేశారు.మంగపేట ఎస్.ఐ రవికుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బాధితులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ప్రస్తుత రేటు ప్రకారం డబ్బులు వారి ఖాతాల్లో జమ చేస్తామని కెనరా బ్యాంక్ అడిషనల్ డిప్యూటీ మేనేజర్ శ్రీనివాస రావు తెలిపారు.
మీకు తెలుసా!..దయచేసి చదవండి... స్వర్ణం గెలిచిన తొలి భారతీయ జిమ్నాస్ట్ గా దీపా కర్మాకర్ .....
https://studiobharat.com/Deepa-became-the-first-Indian-gymnast-to-win-gold ....దయచేసి అప్ డేట్స్ న్యూస్ కోసం సబ్ స్రైబ్ చేసుకోండి..
What's Your Reaction?