నీట్ ద్వారా యంబిబియస్ ఫ్రీ సీట్ ని దక్కించుకున్న లిటిల్ ఏంజిల్స్ విద్యార్థి

జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి

Aug 10, 2023 - 18:17
 0  783
నీట్ ద్వారా యంబిబియస్ ఫ్రీ సీట్ ని దక్కించుకున్న లిటిల్ ఏంజిల్స్ విద్యార్థి

నీట్ ద్వారా యంబిబియస్ ఫ్రీ సీట్ ని దక్కించుకున్న లిటిల్ ఏంజిల్స్ విద్యార్థి

జగ్గయ్యపేట

జగ్గయ్యపేట పట్టణంలో గల లిటిల్ ఏంజిల్స్ హైస్కూల్ మేనేజ్మెంట్ వారి ప్రోత్సాహంతో హెడ్ మాస్టర్ యన్.యస్.ఆర్.యస్ శ్రీనివాస్ మరియు సిబ్బంది కృషితో ఎంతో మంది విద్యావంతులను మేధావులుగా తీర్చిదిద్దింది.ఆ కోవలోదే మట్టిలో మాణిక్యాలను తయారు చేస్తూ భావితరాలకు మంచి విద్యావంతులు తీర్చిదిద్దుతూ,వారి భవిష్యత్తును లిటిల్ ఏంజిల్స్ హైస్కూల్,జగ్గయ్యపేట మరింత వెలుగునందిస్తుంది.మొదటి నుండి ఎనిమిదోవ తరగతి వరకు చదువుకుని,మిగిలిన విద్యాభ్యాసాని వేరొక ప్రాంతంలో చదుకున్న కుమారి కనోజి నాగ ప్రజ్వశ్రీ నీట్ పరీక్ష లో 720 మార్కులకు గాను 550 మార్కులను యంబిబియస్ లో సాధించింది.

దీనితో ఆ బాలికకు ఈసిఐ హైదరాబాద్ వద్ద యంబిబియస్ ఫ్రీ సీట్ రావడం జరిగింది.యంబిబియస్ లో ఫ్రీ సీట్ రావడంతో కుమారి కనోజి నాగ ప్రజ్వశ్రీ వారి తల్లితో కలిసి లిటిల్ ఏంజిల్స్ హైస్కూల్ కి వచ్చి హెడ్ మాస్టర్ యన్.యస్.ఆర్.యస్ శ్రీనివాస్ ని కలిసి తనకు విద్యను అందించిన మేనేజ్మెంట్ వారికి, హెడ్ మాస్టర్ కి, సిబ్బంది కి తను యంబిబియస్ ఫ్రీ సీట్ కి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసింది.దీనితో వారు వారి స్కూల్ లో చదువుకుని ఉన్న విద్యలో ముందుకు వెళ్ళుతున్న కుమారి కనోజి నాగ ప్రజ్వశ్రీ కి వారి కుటుంబ సభ్యులకు సంతోషంతో అభినందనలు తెలిపారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow