స్విమ్మింగ్ తో మానసిక,శారీరిక ఆరోగ్యం
జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి

స్విమ్మింగ్ తో మానసిక,శారీరిక ఆరోగ్యం
మానసిక,శారీరక,ఆరోగ్యం,ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతోపాటు విస్తృతమైన ఉపాధి అవకాశాలు పెంచేందుకు స్విమ్మింగ్ ద్రోహం చేస్తుందని ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను అన్నారు.
దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన జాతీయ ఈతల పోటీలలో జగ్గయ్యపేట స్విమ్మర్లు 59 పతాకాలతో విజయదుందుభి మ్రోగించారు.జగ్గయ్యపేట పట్టణానికి చెందిన కోచ్ పోట్టబత్తిన పాండురంగారావు లక్ష్మి,టీ మేనేజర్ అన్నంనేని కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో జరిగిన న్యూఢిల్లీ నందు సంయుక్త భారతీయ ఖేల్ ఫౌండేషన్ వారు న్యూఢిల్లీ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ స్విమ్మింగ్ పూల్ కాంప్లెక్స్ నందు నిర్వహించిన ఈతల పోటీలలో గెలుపొందిన విజేతలను రాష్ట్ర ప్రభుత్వవిప్,శాసనసభ్యులు సామినేని ఉదయభాను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ దేశ రాజధాని లో జరిగిన ఈతల పోటీల్లో మన జగ్గయ్యపేట స్విమర్స్ విజయం సాధించడం గర్వకారణం అన్నారు,దేశ నలుమూలలో ఎక్కడ ఏ పోటీలు జరిగినా మన జగ్గయ్యపేట స్విమర్స్ నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొస్తున్నారని తెలిపారు.మొత్తం మన నియోజకవర్గ నుండి 22 మంది ఈతల పోటీలలో పాల్గొనగా 59 పథకాలు సాధించారని అన్నారు.ఈ 22 మంది స్విమ్మర్స్ లో 36 పసిడి పతాకలు,19 రజిత పతాకలు,4కాంస్య పతాకలు మొత్తంగా 59 పథకాలు సాధించి మన నియోజకవర్గానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారు అని అన్నారు.వారికి రాబోయే రోజుల్లో మరింత భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర,వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్,పట్టణ కౌన్సిలర్లు వట్టెం మనోహర్,పందుల రోశయ్య తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?






