అవినీతి కేసులో ఎస్సైకి ఐదేండ్ల జైలు శిక్ష
కరీంనగర్ స్టూడియో భారత్ ప్రతినిధి
అవినీతి కేసులో ఎస్సైకి ఐదేండ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా
కరీంనగర్
అవినీతికి పాల్పడుతూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన నేరంలో నిందితుడైన ఎస్సైకి ఐదేండ్ల జైలు శిక్ష,రూ.10 వేల జరిమానా విధిస్తూ మంగళవారం సాయంత్రం కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కుమార్ వివేక్ తీర్పు చెప్పారు.
ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం..
కామారెడ్డికి చెందిన రంగా ధర్మాగౌడ్ బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లి అకడ డ్రై వర్‌గా పనిచేస్తున్నాడు. అతని కొడుకు నరేశ్‌గౌడ్ డిగ్రీ చదువుతూ ఇంటి సమీపంలోని యువతిని ప్రేమించి పెండ్లి చే సుకున్నాడు.
యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కామారెడ్డి పట్టణ పోలీసులు నరేశ్‌పై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు.పట్టణ ఎస్సై ధర్మాగౌడ్‌ను పిలిచి నరేశ్‌కు అనుకూలంగా చార్జి షీట్ వేస్తానని దానికి రూ.6 వేలు లంచం డిమాం డ్ చేశాడు.
2006 మే 4న ధర్మాగౌడ్ వద్ద ఎస్సై రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
What's Your Reaction?