సౌదీ అరేబియాలో భారీ గాలులు ఎగిరిపడ్డ ప్రజలు
సౌది అరేబియా స్టూడియో భారత్ ప్రతినిధి
సౌదీ అరేబియాలో భారీ గాలులు.. ఎగిరిపడ్డ ప్రజలు
సౌదీ అరేబియా (Saudi Arabia) లోని ప్రధాన నగరాల్లో మంగళవారం తీవ్ర గాలులు,ఉరుములు,మెరుపులు కాసేపు విధ్వంసం సృష్టించాయి.రోడ్లపై భారీ హోర్డింగులు,టవర్లు నేలకొరగడంతో తీవ్ర ఆస్తి నష్టం సంభవించింది.ఆధ్యాత్మికంగా ప్రసిద్ధ నగరాలైన జెద్దా,మక్కాలలోనూ భీకర గాలులు బీభత్సం సృష్టించాయి. వీటికి సంబంధించిన పలు వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి.
ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో తెలియని గాలి మొత్తం జనాలందరినీ ఈడ్చి పడేసింది. భారీ వస్తువులు సైతం ఆ గాలి తాకిడికి ఎగిరిపోయాయి. మక్కా మసీదులో ప్రార్థనకు వచ్చిన వారు సైతం ఈ గాలుల బారిన పడ్డారు. రోడ్లపై ఉన్న భారీ హోర్డింగ్‌లు, కరెంట్ పోల్స్ ఎగిరి వాహనాలపై పడ్డాయి. అయితే ఎవరికీ గాయాలు కాలేదు. రోడ్లపై నడుస్తూ ఉండగానే కొంత మంది గాల్లోకి ఎగిరి కిందపడిపోయారు.
జెద్దాలో ఈ గాలులకు తోడు ఇసుక తుపాను ముంచెత్తింది. భారీ ఇసుక మేఘాలు నగరాన్ని కమ్మేశాయని కొన్ని కథనాలు పేర్కొన్నాయి.మరో 24 గంటల పాటు దేశంలో ఇలాంటి అసాధారణ వాతావరణ పరిస్థితులు తలెత్తే అవకాశముందని సౌదీ వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. మదీనా, మక్కా, ఆసిర్, జాజన్, అల్ బహా తదితర నగరాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.
What's Your Reaction?