తిరుపతి నూతన బస్టాండుకు ఈ నెలలోనే టెండర్లు
తిరుపతి స్టూడియో భారత్ ప్రతినిధి
తిరుపతి నూతన బస్టాండుకు ఈ నెలలోనే టెండర్లు
తిరుపతి :
తిరుపతిలో రూ.400 కోట్లతో 13 ఎకరాల్లో ఇంటర్ మోడల్ సెంట్రల్ బస్టేషన్ ఏర్పాటుకు డీపీఆర్ డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ సిద్ధం చేశామని కేంద్ర రోడ్డు రవాణా,జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.దీనికి గతేడాది ఆర్టీసీతో ఎంవోయూ జరిగిందని ఈ నెలలోనే టెండరు దశ పూర్తవుతుందన్నారు.కృష్ణ పట్నం పోర్టుకు కనెక్టివిటీ ప్యాకేజీ 2,3,4 జాతీయ రహదారుల నిర్మాణానికి డిజిటల్ విధానంలో గురువారం ఉదయం తిరుపతి తారకరామా స్టేడియంలో శంకుస్థాపన చేశాక జరిగిన సభలో ఆయన మాట్లాడారు.
రేణిగుంట - నా యుడుపేట మధ్య రూ.2300కోట్లతో జరుగుతున్న 6లేన్ల జాతీయ రహదారి పనులు వచ్చే ఏడాది జనవరికల్లా పూర్తవుతాయన్నారు.ఏపీలో 7 గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణాలు చేపట్టగా బెంగుళూరు- చెన్నై,కోలారు జిల్లా బేతమంగళం-చిత్తూరు జిల్లా గుడిపాల,చిత్తూరు-చెన్నయ్ సమీపంలోని తచ్చూరు మార్గాలు వీటిలో ప్రధానమైనవన్నారు.ప్రస్తుతం బెంగళూరు-చెన్నై ప్రయాణ సమయం 6 నుంచి 7 గంటలుందని హైవే పూర్తయితే రెండున్నర గంటల్లో వెళ్లిపోవచ్చన్నారు.వివిధ దశల్లోని ఎన్‌హెచ్ పనుల ఫొటో ప్రదర్శనను తిలకించారు.రాష్ట్ర మంత్రి దాడిశెట్టి రాజా,ఎంపీ గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు...!!
What's Your Reaction?