వెనుకబడిన కులాల రుద్ర భూమి దుస్థితిని పట్టించుకునే నాథుడే కరువైయ్యే!

జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి

Feb 27, 2025 - 06:47
Mar 2, 2025 - 11:50
 0  105
వెనుకబడిన కులాల రుద్ర భూమి దుస్థితిని పట్టించుకునే నాథుడే కరువైయ్యే!

వెనుకబడిన కులాల రుద్ర భూమి దుస్థితిని పట్టించుకునే నాథుడే కరువైయ్యే!

స్మశాన వాటిక కు దారి చూపించండి మహానుభావులారా....

స్మశాన వాటిక కు శవంతో ఘననానికి వెళితే కైలాస మార్గమే దిక్కే స్వామి 

జగ్గయ్యపేట 

జగ్గయ్యపేట పట్టణం ముక్త్యాల రోడ్డు రైల్వే బ్రిడ్జి, పాలేరు ఓడ్డున గల బిసి కులాలైన పద్మశాలి,వడ్డెర,ముద్దిరాజు,చాకలి కులాలకు చెందిన రుద్ర భూమి హిందూ స్మశాన వాటిక కలదు.వీటి అభివృద్ధికి 2014 సంవత్సరంలోను ప్రస్తుత శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) కృషి మూలానా ప్రహరి నిర్మాణాని చేపట్టడం జరిగింది.2019 సంవత్సరం ప్రస్తుత జనసేన జిల్లా అధ్యక్షులు మాజీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను కృషితో బిసిల స్మశాన వాటికలో స్నాన ఘట్టాలు మరియు కట్టె కాలుపు గద్దులను ఏర్పాటు చేయడం జరిగింది.

కొన్ని నెల క్రితం వచ్చిన తుఫాను విపత్తు లో భాగంగా బిసిల కులాల స్మశాన వాటిక రుద్రభూమి వరద ప్రవాహం లో కొట్టుకొని పోవడంతో పూర్తిగా విధ్వంసానికి గురైంది.దీనితో నిర్మించిన ప్రహరి గోడలు మరియు నిర్మాణాలు సైతం పడిపోయాయి.రాష్ట్రంలో జరిగిన వరద బీభత్సానికి గురైన నష్టానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందించాయి.దీనిలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గార్లు ఆర్థిక సహాయాన్ని యుద్ధ ప్రాతిపదికన అందించడం జరిగింది.మున్సిపాలిటీ పాలక మండలి చైర్మన్ పదవి బిసి అయినప్పటికీ వారి అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం సరైంది కాదని పలువురు బిసి సంఘాల నాయకులు ప్రశ్నలు గుప్పిస్తున్నారు.

భక్తుల వాహనాల మధ్యలో ఇరుక్కుపోయిన అంబులెన్స్  - https://studiobharat.com/An-ambulance-stuck-in-the-middle-of-devotees-vehicles

కాని బిసిల స్మశాన వాటికలు తూర్పు,ఉత్తరం దారులు ధ్వంసం అయి,ప్రహరి గోడలు పడిపోయి,రుద్రభూమిలోని నిర్మాణాలు విలయ తాండవంలో విధ్వంసానికి గురై నేటికి సుమారు ఆరు నెలల కాలం దాటుతున్న పట్టించుకునే నాథుడే కరవు అయ్యారు.ఇప్పటికైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గార్లు జగ్గయ్యపేట పట్టణంలో గల విపత్తు వరదల కారణంగా విధ్వంసానికి గురైన బిసి కులాల స్మశాన వాటిక రుద్రభూమిలను ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేయాలని సామాజిక కార్యకర్త మెటికల శ్రీనివాసరావు పత్రిక ముఖంగా వెనుకబడిన కులాల తరుపున కోరుతున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow