భక్తుల వాహనాల మధ్యలో ఇరుక్కుపోయిన అంబులెన్స్
ముక్త్యాల స్టూడియో భారత్ ప్రతినిధి

భక్తుల వాహనాల మధ్యలో ఇరుక్కుపోయిన అంబులెన్స్
జిల్లా పోలీస్ ఉన్నతాధికారి వాహనాలు
ముక్త్యాల
జగ్గయ్యపేట మండలం,ముక్త్యాల గ్రామంలో గల శ్రీ భవాని ముక్తేశ్వర స్వామి మరియు కోటి లింగ హరిహర మహాక్షేత్రం దేవాలయాలకు మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు పోటెత్తారు.దేవాలయానికి విచ్చేయిచున్న భక్తులు,తిరిగి మరలి వెళ్ళుతున్న భక్తుల పలు వాహనాల మధ్యలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని అత్యవసరంగా తరలిస్తున్న ప్రైవేటు అంబులెన్స్ మరియు మరో పక్క పోలీసు జిల్లా ఉన్నతాధికారి వాహనాలు ఎదురు బదురు ట్రాఫిక్ లో సాక్షాత్తు ఇరుక్కుపోయాయి.ఈ సంఘటన స్థానిక సర్కిల్ పరిధిలో గల పోలీసు సమక్షంలో సుమారు ముప్పావు గంటకు పైబడి ఇరుక్కుపోయాయి.
పోలీసు జిల్లా ఉన్నతాధికారి వాహనం వెంబడి సెక్యూరిటీ గా వచ్చిన వారు ఆలస్యంగా అంబులెన్స్ వస్తున్న విషయాని గుర్తించారు.వెంటనే వారు స్థానిక పోలీస్ సిబ్బంది తో కలిసి,ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం చేసారు.ముందస్తుగ స్థానిక పోలీస్ శాఖ సిబ్బంది సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ట్రాఫిక్ లో అంబులెన్స్,ఇటు జిల్లా పోలీస్ ఉన్నతాధికారితో పాటు భక్తులు సైతం ప్రయాణ అలసటగా విసిగిపోయారని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
What's Your Reaction?






