అంగన్వాడీ సమ్మె కు మద్దతుగా ప్రజల నుండి కోటి సంతకాల సేకరణ
జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి

అంగన్వాడీ సమ్మె కు మద్దతుగా ప్రజల నుండి కోటి సంతకాల సేకరణ
జగ్గయ్యపేట
అంగన్వాడీల సమస్యలు,ఐసిడిఎస్ ని కాపాడుకుందాం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా 37 రోజుల నుండి అంగన్వాడీలు నిరవధిక సమ్మె చేస్తున్నారు.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మూడు దఫాలుగా చర్చలు జరిపింది.ప్రదాన డిమాండ్ అయిన అంగన్వాడీల జీతాల పెంపు పై రాష్ట్ర ప్రభుత్వం నుండి స్పష్టత రాకపోవడంతో, అంగన్వాడీలు పండగలు పబ్బాలను సైతం పక్కన పెట్టి మహిళలైన అంగన్వాడీలు పోరాటాని మరింత ఉధృతం చేసారు.
దీనిలో భాగంగా మహిళలైన అంగన్వాడీల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న కక్షపూరిత తీరును ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి మద్దతుగా కోటి సంతకాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు.కోటి సంతకాల సేకరణలో భాగంగా జగ్గయ్యపేట పట్టణంలో 7 వ వార్డు సచివాలయం పరిధిలో గల ప్రజల నుండి అంగన్వాడీలకు మద్దతుగా సంతకాలను సేకరిస్తున్నారు.ఈ సంతకాల సేకరణను 7 వ వార్డు సచివాలయం అంగన్వాడీ కార్యకర్తలు దుడకా సీతామహాలక్ష్మి,యస్ సుజాత తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?






