సాయి తిరుమలగిరి కోల్డ్ స్టోరేజ్ లో బారీ అగ్ని ప్రమాదం
జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి

సాయి తిరుమలగిరి కోల్డ్ స్టోరేజ్ లో బారీ అగ్ని ప్రమాదం
నష్ట పోయిన రైతులను ఆదుకుంటాం - శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్
జగ్గయ్యపేట
జగ్గయ్యపేట పట్టణం తొర్రగుంటపాలెం నుండి తిరుమలగిరి రోడ్డులో గల సాయి తిరుమలగిరి అగ్రి ప్రొడక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ కోల్డ్ స్టోరేజ్ లో అర్థరాత్రి బారీ అగ్ని ప్రమాదం జరిగింది.దీనితో ఐదు అంతస్థులుగా ఉన్న కోల్డ్ స్టోరేజ్ లో ఆరు కాలం పాటు రైతులు పండించి నిల్వ ఉంచిన మిర్చి బారీ అగ్నికి ఆహూతిలో దగ్థం అవుతూ రైతులకు కన్నీటి కడగండ్లను మిగిల్చింది.అసలే మిర్చీ రైతులకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతులకు ఈ అగ్ని ప్రమాదం మూలిగే నక్క పై తాటికాయ పడినట్లుగా వారి కుటుంబాలకు తీరని ఆర్థిక లోటును మిగిల్చింది.
స్థానిక శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) స్వయంగా ఈ సంఘటన అధికారులతో కలిసి పనిచేయడం జరిగింది.బారీ అగ్ని ప్రమాద మంటలను అగ్నిమాపక సిబ్బంది,పోలీసు సహకారంతో కలసి ఆర్పే ప్రయత్నాలను చేస్తున్నారు.రెవెన్యూ,మార్కెట్ యార్డు కమిటీ,మున్సిపల్ సిబ్బంది లు అర్థరాత్రి నుండి అక్కడే ఉండి మంటల ఉధృతాని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు.బారీ అగ్ని ప్రమాద మంటలు అదులోకి రాకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది ప్రత్యేకంగా భారీ మంటలను ఆర్పడానికి అధునాతన వాహనాలను,మంటలార్పే కెమికల్ లిక్వీడ్ వాహనాన్ని తీసుకొని వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నాలను చేస్తున్నారు.కొంత మేర మంటలు అదుపులోకి రావడంతో రికార్డులను మార్కెట్ యార్డు కమిటీ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది.
ఈ సంఘటన పై నందిగామ ఆర్.డి.ఓ కె బాలకృష్ణ ని వివరగా కోరగా ... ఈ అగ్ని ప్రమాదంలో మార్చి 1 వ తేదీ నాటికి ప్రాధమిక అంచనా ప్రకారం సుమారు 385 మంది రైతులు మిర్చిని కోల్డ్ స్టోరేజ్ లో బ్యాగులను నిల్వ చేసారని,వీరిలో ఎక్కువ మంది రైతులు వత్సవాయి మండలం భీమవరం గ్రామానికి చెందిన రైతులే ఎక్కువ మంది ఉన్నారన్నారు.మార్కెట్ యార్డు వారి లెక్కల ప్రకారం మార్చి 1 వ తేదీ నాటికి 13960 మిర్చి బ్యాగులున్నాయని ఆయన అన్నారు.కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం వారు మాత్రం 35,000 మిర్చి బ్యాగులు ఉన్నాయని చెప్పుతున్నారని ఆయన తెలియజేశారు.మార్కెట్ యార్డు కమిటీ లెక్కల ప్రకారం సుమారు 4 కోట్ల మేర రైతులకు నష్టం జరిగినట్లు ఆయన తెలియజేశారు.ఈ విషయాన్ని యన్.టి.ఆర్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళామన్నారు.కోల్డ్ స్టోరేజ్ కి ఇన్సూరెన్స్ రెన్యూవల్ పై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఒక్కవేళ ఇన్సూరెన్స్ రెన్యువల్ కాకపోతే బ్యాంకు లో తీసుకున్న లోన్ల పరిస్థితులు ఏమౌతాయోనని కొంతమంది రైతులలో ఆవేదన చెందుతున్నారు.
అధ్యక్ష పదవిని షెడ్యూల్ కులం వారు అలంకరించడానికి గల జాప్యానికి కారణాలు ఏమిటో - https://studiobharat.com/What-are-the-reasons-for-the-delay-in-decorating-the-Scheduled-Caste-houses
ఈ ఘటన పై స్థానిక శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ప్రత్యేక దృష్టి తో రైతులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తున్నారు.ఈ ఘటనలో సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి అంబోజి శివాజీ,సిపిఐ పట్టణ కార్యదర్శి జూనెబోయిన శ్రీనివాసరావు,ఏవైఐయఫ్ జిల్లా అధ్యక్షులు కరిసే మధు,పట్టణ నాయకులు షేక్ అసదుల్లా,మెటికల శ్రీనివాసరావు,ఏఐటియుసి బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు నీలకంఠ ప్రసాద్,సిపిఎం నాయకులు రైతులకు న్యాయం చేయాలని ఆర్.డి.ఓ దృష్టికి తీసుకెళ్లారు.వైకాపా నాయకులు కూడా ఈ సంఘటనని సందర్శించారు.
What's Your Reaction?






