అధ్యక్ష పదవిని షెడ్యూల్ కులం వారు అలంకరించడానికి గల జాప్యానికి కారణాలు ఏమిటో
స్టూడియో భారత్ ప్రతినిధి

అధ్యక్ష పదవిని షెడ్యూల్ కులం వారు అలంకరించడానికి గల జాప్యానికి కారణాలు ఏమిటో
జగ్గయ్యపేట
జగ్గయ్యపేట పట్టణంలో ప్రభుత్వ ఆధీనంలో సుమారు 1970 సంవత్సరంలో ఏర్పాటు కాబడిన వ్యవసాయ మార్కెట్ యార్డు కలదు.ఈ మార్కెట్ యార్డు జగ్గయ్యపేట నియోజకవర్గ మరియు పట్టణ ప్రాంత రైతులకు మరియు పశువుల సంత ఎంతో ఉపయోగకరంగా ఉంది.ఇప్పటికే వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ కి 1970 సంవత్సరం నుండి పాలక మండలి కమిటీ గా 16 కమిటీలు ప్రభుత్వం ఏర్పాటు చేయగా ఈ కమిటీ పాలక మండలి అధ్యక్షులుగా కమ్మ,వైశ్య,కాపు సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువ సార్లు పదవిని అనుభవించగ,బిసీ లకు మాత్రం తక్కువ అనే చెప్పుకోవచ్చు.
ఇదిలా ఉండగా షెడ్యూల్ కులం (యస్.సి) వారికి పాలక మండలి కమిటీ లో స్థానిక శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) మరియు జిల్లా తెదేపా అధ్యక్షులు నెట్టెం రఘురాం ల చొరవతో రాష్ట్ర ప్రభుత్వం వారికి అధ్యక్ష పదవి స్థానాన్ని కల్పించాలనే ఉద్దేశంతో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.దీనితో నియోజకవర్గంలోని షెడ్యూల్ కులంలోని నాయకులు స్థానిక ప్రజాప్రతినిధులకు,ప్రభుత్వానికి హర్షం వ్యక్తం జేశారు.దీనితో కొందరు వ్యక్తులు షెడ్యూల్ కులానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్ష పదవి దక్కకూడదనే అధిష్టానం వద్ద లాబీయింగ్ అంతర్గతంగా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.నోటిఫికేషన్ వల్ల షెడ్యూల్ కులానికి ప్రభుత్వం కల్పించబోతున్న అధ్యక్ష పదవి చేయి జారి పోయి దక్కకుండ పోయ్యే అవకాశం ఉంటుందేమోనని పలువురు ఆవేదన చెందుతూ గుసగుసలాడుకుంటున్నారు.
యద్దేచ్చగా సాగుతున్న రియల్ ఎస్టేట్ దందా - https://studiobharat.com/The-rampant-real-estate-business
షెడ్యూల్ కులంగా వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ అధ్యక్ష పదవి అలంకరించాలని సుమారు రెండు నెలల క్రితమే ప్రభుత్వం నుండి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి అందరికి విదితమే.కాని నోటిఫికేషన్ విడుదల అయిన రెండు నెలలు దాటుతుంటే అధికార పార్టీలో అంతర్గత లాబీయింగ్ ఎవ్వరో జరుపుతున్నారనే అనుమానం వ్యక్తం అవుతున్నట్లు దీనితో షెడ్యూల్ కులస్తులు బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఏది ఏమైన వెంటనే ఎటువంటి లాబీయింగ్ లకు తావులేకుండా నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రకారం వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ అధ్యక్ష పదవి రిజర్వేషన్ ప్రకారం షెడ్యూల్ కులం (యస్.సి) వారికి ప్రభుత్వం వెంటనే కేటాయింపులు జరిపించాలని పలువురు పెద్దలు చెప్పుకోలేని పరిస్థితులలో ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు.
What's Your Reaction?






