షీ టీమ్స్,సైబర్ నేరాల పై అవగాహన
సూర్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి
షీ టీమ్స్,సైబర్ నేరాల పై అవగాహన
సూర్యాపేట పట్టణం
ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు సూర్యాపేట పట్టణ PS పరిది భగత్ సింగ్ నగర్ లోని మాంటిస్సోరి పాఠశాలలో జిల్లా షీ టీమ్స్, మరియు పోలీసు కళాభృందం అధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది.
మహిళల,విద్యార్థుల రక్షణ,చట్టాలు,విద్యా విధానాలు,సమస్యలను అధిగమించడం,సోషల్ మీడియా,ఇంటర్నెట్ సద్వినియోగం లాంటి అంశాలపై మరియు విద్యార్థులు ఒత్తిడి అధిగమించి లక్ష్యాలను చేరుకోవాలి,లక్ష్యం కోసం కృషి చేయాలని పోలీస్ కళాబృందం సభ్యులు పాటల ద్వారా అవగాహన కల్పించడం జరిగింది.
సూర్యాపేట 2 టౌన్ SI మహేంద్రనాథ్ మాట్లాడుతూ జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే ఐపిఎస్ గారి అధ్వర్యంలో మహిళల రక్షణపై పటిష్టంగా పని చేస్తున్నామని,విద్యార్థులు సమస్యలు ఉంటే అధ్యాపకుల దృష్టికి, అధికారుల దృష్టి తేవాలని,మానసిక దైర్యం కలిగి ఉండాలని,అనుకూల,ప్రతికూల సమయాల్లో స్పందించేలా అవగాహన కలిగి ఉండాలని తెలిపినారు.తల్లిదండ్రుల కోరికలను,కళలను నెరవేర్చాల్సి బాధ్యత మనపై ఉన్నది అని గుర్తు చేశారు. ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి, సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురు కావద్దు, వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ ఖాతా,ATM కార్డ్ వివరాలు,OTP వివరాలు ఇతరులకు తెలపవద్దు. ఇతరులు ఆశ చూపితే వారి ఆకర్షితులు కావద్దు అని తెలిపినారు. మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కొరినారు. సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే వేధింపులపై 100 కు సమాచారం ఇవ్వాలని తెలిపినారు.
పోలీసు కళబృందం వారు సాంస్కృతిక,జానపద కార్యక్రమాలతో సామాజిక అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమం నందు మాంటిస్సోరి పాఠశాల ప్రిన్సిపల్ రణబోతు రవీందర్ రెడ్డి సూర్యాపేట షీ టీం హెడ్ కానిస్టేబుల్స్ జాఫర్, యల్లారెడ్డి, కళాబృందం ఇంచార్జ్ యల్లయ్య, గోపి,నాగార్జున ఉపాధ్యాయసిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
What's Your Reaction?