ఏపీ సీఎం జగన్ నొక్కని బటన్లు ఇవే

నర్సాపురం స్టూడియో భారత్ ప్రతినిధి

Jun 27, 2023 - 18:23
 0  29
ఏపీ సీఎం జగన్ నొక్కని బటన్లు ఇవే

ఏపీ సీఎం జగన్ నొక్కని బటన్లు ఇవే.. నరసాపురంలో పవన్ కళ్యాణ్ ఫైర్

నర్సాపురం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. కోనసీమ జిల్లాలో జోరుగా వారాహి విజయ యాత్రను కొనసాగిస్తున్నారు.తాజాగా ఆయన మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శల వర్షం కురిపించారు.సీఎం జగన్ బటన్ నొక్కి డబ్బులు వేయడాన్ని సభలో ప్రస్తావించారు. ఇప్పటి వరకూ బటన్ నొక్కి సంబరం చేసుకున్నారని, సీఎం జగన్ నొక్కని బటన్లను చెబుతానంటూ పవన్ వ్యాఖ్యానించారు.

'పూర్తి కాని పోలవరం,ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం, మత్య్సకారుల దీనస్థితి,అభివృద్ధికి నోచుకోని ఏపీ,అప్పుల ఆంధ్రప్రదేశ్,మూతపడ్డ 8 వేల స్కూళ్లు, తాగునీరు అందని గ్రామాలు' వంటివి సీఎం జగన్ నొక్కని బటన్లు అని పవన్ కల్యాణ్ విమర్శించారు.ప్రజలకు రాజ్యాధికారం రావాలంటే జనసేన అధికారంలోకి రావాలని,తనను నమ్మితే ప్రజల వెంటే ఉన్నానని పవన్ హామీ ఇచ్చారు.బలమైన పాలకులతోనే ఏపీ నెంబర్ 1 అవుతుందని, జనం బాగుపడాలంటే సీఎం జగన్ పోవాలని పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow