మాదక ద్రవ్యాల నియంత్రణ పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి - కలక్టర్ ప్రశాంతి
తూర్పు గోదావరి జిల్లా స్టూడియో భారత్ ప్రతినిధి

మాదక ద్రవ్యాలు వినియోగం, అనర్థాలు పై చర్చ జరగాలి.
తల్లితండ్రులు,ఉపాద్యాయులు మాదక ద్రవ్యాలను వినియోగించే వారి ప్రవర్తన నిశితంగా పరిశీలించడం సాధ్యం అవుతుంది.
మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి.
- కలక్టర్ ప్రశాంతి
- ఎస్పీ నరసింహా కిషోర్
తూర్పు గోదావరి
మాదక ద్రవ్యాలు వినియోగం, సమాజం పై దాని ప్రభావం పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉన్నా, దాని వినియోగం పూర్తిగా అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి స్పష్టం చేశారు.
మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ (NCORD) సమావేశానికి సమన్వయ కర్తగా ఎస్పి డి.నరసింహ కిషోర్, ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ...
జిల్లాలో మాదక ద్రవ్యాల, గంజాయి వినియోగం, నియంత్రణ కార్యక్రమం ప్రతి ఒక్క శాఖ విజిలెన్స్ విభాగం సమర్థవంతంగా పనితీరు చూపాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. బస్సుల్లో, రైళ్ల లో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు రవాణా జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్న దృష్ట్యా మాదక ద్రవ్యాలు సేవిస్తూన్న వారికి వాటిని తీసుకున్న విషయం కూడా తెలియని సందర్భాన్ని ఇటీవల కాలంలో గుర్తిచడం జరిగిందనీ తెలిపారు. నేడు మాదక ద్రవ్యాలు వినియోగం, సమాజం పై దాని ప్రభావం విషయముపై విస్తృత స్థాయిలో చర్చ జరపాలి అని కోరారు. తల్లి తండ్రులు ఇండ్లలో, ఉపాధ్యాయులు పాఠశాలలో, కాలేజీల్లో కూడా మాదక ద్రవ్యాలు పై నిరభ్యంతరంగా మాట్లాడడం వల్ల వాటిపై అవగాహనా పెరుగుతుందని తెలిపారు. డ్రగ్స్ కంట్రోలర్ ఆద్వర్యంలో వినియోగం లేని క్లోజ్డ్ స్టోర్స్, ఫ్యాక్టరీ ల వివరాలు తెలియ చెయ్యాలని ఆదేశించారు. డెకయిట్ ఆపరేషన్స్ చేసి మత్తు కలిగించే మందులు వినియోగం పై దృష్టి పెట్టాల్సి ఉంటుందన్నారు.
ఎన్ఫోర్స్మెంట్ విభాగం కేసులు నమోదు చెయ్యాలని ఆదేశించారు. రానున్న సమావేశంలో ఆర్డీవో లు, డిఆర్డిఏ , మెప్మా, డ్వామా లను భాగస్వామ్యం కావాలని పేర్కొన్నారు. సాంఘీక సంక్షేమ, ఇతర వసతి గృహాలలో నిఘా పెంచాలన్నారు. ఎటువంటి భావజాలాలు గురి కాకుండ సమాజానికి జరిగే దుష్ర్పభావం పై మాట్లాడడం ద్వారా చైతన్యం తీసుకొని రావడం సాద్యం అని కలక్టర్ తెలియ చేశారు. రానున్న సమావేశంలో శాఖ పరమైన చర్యలు పై సమీక్ష నిర్వహించాలని పేర్కొన్నారు.
జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ మాట్లాడుతూ...
చాలా మందికి తెలియ కుండా మాదక ద్రవ్యాలు సేవిస్తూ సమాజానికి చెడు అలవాట్లకు బానిస అవుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.విద్యార్థి దశలో మాదక ద్రవ్యాలు సేవిస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, వాటిపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.జిల్లాలో 2700 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.అదే సమయంలో 900 మంది వరకూ గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు,మత్తు కలిగించే వాటిని వినియోగిస్తున్నట్లు తెలిపారు.వీటిని వినియోగం పూర్తిగా నియంత్రించే క్రమంలో ప్రతి ఒక్కరు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
మాదకద్రవ్యలు నియంత్రణ పై స్కూల్స్, కళాశాలలు,వసతి గృహాల విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు.కేసులు పెట్టినంత మాత్రన సమస్య పరిష్కారం కాదని ముందుగానే మాధక ద్రవ్యాలు నిరోధకం పై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలన్నారు. రాజమహేంద్రవరం,సీతానగరం,గోకవరం వంటి ప్రాంతల్లో గంజాయి,ఇతర మాదక ద్రవ్యాలు పోలీస్ శాఖ సమన్యంతో విస్తృతంస్థాయిలో క్యాంప్స్ నిర్వహించి ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలన్నారు. రాజమహేంద్రవరం,నిడదవోలుతో పాటు చుట్టు ప్రక్కల గ్రామాల్లో మాదక ద్రవ్యాలు నియంత్రణే లక్ష్యంగా పోలీస్, ఎక్సయిజ్,ఇతర అనుబంధ శాఖలతో అంతర్గత బృందాలను నియమించి పటిష్ట నిఘా స్థాయిని పెంచాలని కోరారు.రాజమహేంద్రవరంలో బ్లేడ బ్యాచ్ పై మరింత నిఘా పెంచి అరికట్టామని,ఇప్పటి వరకు 140 మంది పై కేసులు నమోదు చేసామన్నారు.
ఈ సమావేశంలో విశాఖపట్నం డివిజన్ ఎన్సీబీ బృందం సభ్యులు అభిజిత్ ,రోహన్,డ్రగ్స్ సహయ సంచాలకులు డి.నాగమణి,డీఈవో కె.వాసుదేవరావు,సంక్షేమ శాఖ అధికారులు ఎమ్ ఎస్ శోభారాణి,కే ఎన్ జ్యోతి,బి.శశాంక,ఇతర పోలిస్,అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
What's Your Reaction?






