చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యుల ఆందోళన..

రాజమండ్రి స్టూడియో భారత్ ప్రతినిధి

Oct 15, 2023 - 09:45
Oct 15, 2023 - 09:47
 0  76
చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యుల ఆందోళన..

చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యుల ఆందోళన..

రాజమండ్రి :

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు..

శనివారం నాడు చంద్రబాబుతో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్,నారా భువనేశ్వరి,తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్ అయ్యారు.ములాఖత్ అనంతరం మీడియాతో మాట్లాడకుండానే నారా లోకేష్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.ఈ సందర్భంలో చంద్రబాబును చూసి నారా భువనేశ్వరి,లోకేష్ భావోద్వేగానికి గురయ్యారు.మానసికంగా చంద్రబాబు స్ట్రాంగ్‌గా ఉన్నా....ఆరోగ్య సమస్యలపై కుటుంబ సభ్యుల ఆందోళన చెందుతున్నారు.అక్టోబర్ 6 తేదీ నుంచి ములాఖత్‌లో ఆరోగ్యంగా కనిపించిన చంద్రబాబు..నేడు వీక్‌గా కనిపించడంపై కుటుంబ సభ్యులు బాధ పడుతున్నారు.గత ములాఖత్ నాటికి, నేటికి చంద్రబాబులో చాలా మార్పు వచ్చినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు..

చంద్రబాబు ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది : కాసాని జ్ఞానేశ్వర్

చంద్రబాబు ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని కాసాని జ్ఞానేశ్వర్( Kasani Gnaneswer) తెలిపారు.చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై మాజీ మంత్రులు జవహర్,పీతల సుజాత మీడియాతో మాట్లాడారు. జైలులో ఉన్న చంద్రబాబు ఆరోగ్యం క్షీణించందన్న ఆవేదనతోనే లోకేష్,భువనేశ్వరిలు మీడియాతో మాట్లాడలేదు.చంద్రబాబుకు ఏదైనా హాని జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు..

జైలులో చంద్రబాబుకు వైద్య పరీక్షలు..

చంద్రబాబు కు వైద్య పరీక్షల కోసం రాజమండ్రి సెంట్రల్ జైలుకి ప్రభుత్వ ఆస్పత్రి చర్మ వ్యాధుల నిపుణులు డాక్టర్లు సూర్యనారాయణ,సునీతాదేవి చేరుకున్నారు.చంద్రబాబుకు జైలులో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు..

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow