తెదేపా జనసేన అఖండ విజయం సాదించడం ఖాయం: భువనేశ్వరి
శ్రీకాళహస్తి స్టూడియో భారత్ ప్రతినిధి

2024లో తెదేపా జనసేన అఖండ విజయం ఖాయం: భువనేశ్వరి
శ్రీకాళహస్తి:
వైకాపా వాళ్లది ధన బలమైతే.. తెలుగుదేశం పార్టీది ప్రజా బలమని నారా భువనేశ్వరి అన్నారు. 2024లో వచ్చే కురుక్షేత్ర సంగ్రామంలో తెదేపా-జనసేన కూటమి అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు..
'నిజం గెలవాలి' కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేసిన సభలో భువనేశ్వరి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
అంబేడ్కర్ రాసిన రాజ్యాంగమే మన దేశాన్ని నడిపిస్తోందన్నారు. రాజ్యాంగాన్ని అమలు చేసే పాలకులు మంచివారైతేనే ప్రజలకు మేలు జరుగుతుందని, చెడ్డవారైతే ప్రజలకు కీడు జరుగుతుందని అంబేడ్కర్ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. ఏపీ అంటే ఇప్పుడు .. కమీషన్ కోసం కంపెనీలను బెదరగొట్టడం, కరెంటు బిల్లుల గురించి అడిగితే కేసులు పెట్టడం, నిత్యావసరాల ధరలు అధికంగా ఉన్న రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రంగా మారిందని భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ''ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు ఆత్మగౌరవం తీసుకొస్తే.. చంద్రబాబు ఆత్మవిశ్వాసం తెచ్చారు. అలాంటి వ్యక్తిని 49 రోజులుగా జైల్లో పెట్టారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం తప్పా, అమరావతి రాజధాని నిర్మించడం తప్పా, పోలవరం కట్టడం తప్పా. ఆయన చేసిన నేరం ఏమిటి?'' అని భువనేశ్వరి ప్రశ్నించారు..
What's Your Reaction?






