ఓరుగల్లు విజయసంకల్ప సభ
వరంగల్ స్టూడియో భారత్ ప్రతినిధి

డబుల్ ఇంజన్ సర్కార్ తో తూర్పులో పరిశ్రమలు నెలకొల్పుకుందాం..
కేసీఆర్ నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదు – ఎర్రబెల్లి ప్రదీప్ రావు
తెలంగాణలో రాబోయే ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తాయని కేంద్ర హోంశాఖ మంత్రి వర్యులు అమిత్ షా అన్నారు.ఖిలా వరంగల్ వాకర్స్ గ్రౌండ్ అమిత్ షా అధ్యక్షతన జరిగిన విజయ సంకల్ప సభ విజయవంతం అయ్యింది.సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.తూర్పు నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్ధి ఎర్రబెల్లి ప్రదీప్ రావు,వర్ధన్నపేట,నర్సంపేట,వరంగల్ పశ్చిమ అభ్యర్ధులు ఈ సభలో పాల్గొన్నారు.
ఈ సభలో అమిత్ షా ప్రసంగిస్తూ..
తూర్పులో ఎర్రబెల్లి ప్రదీప్ రావును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.కాంగ్రెస్,బీఆర్ఎస్ లు బీసీలకు తీవ్ర అన్యాయం చేశాయని,బీజేపీకి అవకాశం ఇస్తే బీసీనే సిఎం చేస్తుందని హామీ ఇచ్చారు.ఇచ్చిన హామీలను కేసీఆర్ నిలబెట్టుకోలేదు. అబద్దపు మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని,తెలంగాణలో బీఆర్ఎస్,కాంగ్రెస్ టైం అయిపోయిందని...బీజేపీ టైం వచ్చిందన్నారు.ప్రాజెక్టుల పేరుతో కమిషన్లు తీసుకొని కోట్లు సంపాదించుకున్నారన్నారు.బీజేపీ గెలిపిస్తే..అయోద్యలో రామమందిర ఉచిత దర్శంనం కల్పిస్తామని అన్నారు.
అనంతరం ప్రదీప్ రావు మాట్లాడుతూ..
బిఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీలు తూర్పు నియోజకవర్గానికి తీవ్ర అన్యాయం చేసాయన్నారు.అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా ఆదిపత్యం కోసం పాకులాడారని విమర్శించారు.ఆ రెండు పార్టీలు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్నాయని ఆరోపించారు.బీసీలు,దళితులకోసం ఏమీ చేయలేదని,ఓట్ల కోసమే వారిని వాడుకుని మోసం చేశారన్నారు.తనకి ఓటు వేసి గెలిపిస్తే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని,అప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా తూర్పు నియోజకవర్గానికి పరిశ్రమలను తీసుకొస్తానని హామీ ఇచ్చారు.మహిళల కోసం కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేపిస్తానని అన్నారు.
What's Your Reaction?






