టిడీపీ - జనసేన పార్టీల పొత్తు ఎవరికి లాభం
స్పెషల్ స్టూడియో భారత్ ప్రతినిధి

టిడీపీ - జనసేన పార్టీల పొత్తు ఎవరికి లాభం…
టిడీపీ - జనసేన పార్టీల పొత్తులో లాభపడేదెవరూ? అనదే బిగ్ కోశ్చన్....
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మైండ్ సెట్ చాలామందికి తెలిసిందే.ఎందుకంటే ఈ పొత్తులో ఖచ్చితంగా లాభపడేది టీడీపీ దేనాన్నట్లుంది.
ఎందుకంటే చంద్రబాబు గత చరిత్ర తెలిసిన వారికి ఖచ్చితంగా ఇప్పటికే అర్థమైయి ఉంటుంది కూడా. తాజాగా టీడీపీ - జనసేన సమన్వయ కమిటీ వెనుక ఉన్న చంద్రబాబు మాస్టర్ ప్లాన్ పవన్‌ను వాడుకుని జనసేన ప్రభావం లేకుండా చేయడమేనని రాజకీయాలపై కాసింత అవగాహన ఉన్న వారికి అర్ధమవుతోంది.
ఉమ్మడి మేనిఫెస్టో వల్ల లాభం ఎవరికి
ఒక్క వైపు ఉమ్మడి మేనిఫెస్టో పై ఇరు పార్టీల నేతలు తీవ్ర కసరత్తు చేస్తున్నారు.కానీ అసలు విషయం సీట్ల సంఖ్య,స్థానాలపై మాత్రం చంద్రబాబు నుండి ఎలాంటి క్లారిటీ లేదనేది అర్థం అవుతున్న విషయం.మరో వైపు జనసేనా పవన్ మాత్రం చాలా మంది నేతలకు ఇప్పటికే హామీ కూడా ఇచ్చేశారు.ఇక కొన్ని చోట్ల టీడీపీ - జనసేన నాయకులు మధ్య విబేధాలు కనబడుతున్న పరిస్థితి నెలకొంది.ఈ నేపథ్యంలోనే సమన్వయ సమావేశాల పేరుతో చంద్రబాబు కొత్త డ్రామాకి తెర లేవనెతేరనేది ప్రజలలో చర్చలు నడుస్తున్నాయి..
జనసేన కి టిక్కెట్లు తగ్గించడమే లక్ష్యమా!
ఈ సమావేశాల పేరుతో పవన్ పార్టీని కేవలం 10 స్థానాలకే పరిమితం చేయాలని బాబు స్కెచ్ అయి ఉంటుందని ఆ పార్టీ నేతలు లోలోపల భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ సమావేశాల ప్రధాన ఉద్దేశం ఏంటంటే జనసేన అభ్యర్థులను రెండు వర్గాలుగా విభజించి,వారి మధ్య చిచ్చు పెట్టి చివరికి టీడీపీకే మెజార్టీ స్థానాలు దక్కేలా చేయడమే చంద్రబాబు రాజకీయ ఎత్తుగడ అని గతంలో చేసుకున్న పొత్తుల ద్వారా తెలుస్తున్నదని చెప్పుకోవచ్చు.
అలాగే కొన్ని నియోజకవర్గాల్లో జనసేనకు ఒకే అభ్యర్థి ఉంటే ఆయన్ని ఎలా దెబ్బతీయాలి లేదంటే టీడీపీకి అనుకూలంగా ఎలా మార్చుకోవాలి అన్నది తెలుసుకోవడమే లక్ష్యమని తెలుస్తోంది.ఇక టీడీపీ ఎత్తుగడ అర్ధమైన కొంతమంది జనసేన నాయకులు వారి పార్టీని వీడే ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
బాబు పొలిటికల్ గేమ్యేనా!
ఎందుకంటే చివరి వరకు టికెట్ పై ఆశలు కల్పించి హ్యాండ్ ఇస్తే ప్రజలలో మొహం చూపించుకోలేని పరిస్థితి ఉండటంతో పవన్ తో కొంతమంది నేతల మధ్య పొరసందులు వచ్చింది.ఇక జన సైనికులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండటంతో ఎన్నికల టైం వరకు పవన్ తో ఉండేదెవ్వరు, ఆయన వెంట నడిచేది ఎవరు,అసలు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారనేది తెలియాల్సి ఉంది.మొత్తంగా బాబు పొలిటికల్ గేమ్ ప్లాన్ లో పవన్ పార్టీ జనసేన ఓ పావులా మారడం ఖాయమనా అనేది వేచి చూడాలని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
_-_మరిని అప్ డేట్స్ కోసం http://www.studiobharat.com మరియు
యూట్యూబ్ https://youtube.com/@studiobharat?si=vnSld-WXF9Cj0TTs ని సబ్ స్రైబ్ చేసుకొని చదవగలరు.
What's Your Reaction?






