దుష్టచతుష్టయం కుట్రలను తిప్పికొట్టండి
జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి
దుష్టచతుష్టయం కుట్రలను తిప్పికొట్టండి
24న జరిగే సామాజిక సాధికార యాత్రను విజయవంతం చేయండి.
సన్నాహక సమావేశాల్లో ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మోసపూరిత మాటలను నమ్మొద్దని ప్రభుత్వవిప్,జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను అన్నారు.సంక్షేమ సారథి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని ఎదుర్కొనేందుకు దుష్ట చతుష్టయం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని ఉదయభాను పిలుపునిచ్చారు.జగ్గయ్యపేటలో ఈనెల 24న జరగనున్న సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఆదివారం జగ్గయ్యపేట మండలంలోని గండ్రాయి,మల్కాపురం,షేర్ మహమ్మద్ పేట గ్రామాల్లో కార్యకర్తల సన్నాహక సమావేశాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనరంజక పాలన అందిస్తున్నారన్నారు."నా ఎస్టీ,నా ఎస్సీ,నా బీసీ,నా మైనార్టీ" అంటూ బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు.రాజకీయ పదవుల్లో కూడా వారికి అగ్రస్థానాన్ని కల్పిస్తున్నారని అన్నారు.చంద్రబాబు పాలనలో ఏ ఒక్క సామాజికవర్గం కూడా సంతోషంగా లేదని తెలిపారు.జన్మభూమి కమిటీల పేరుతో పచ్చ చొక్కాల వారికే పథకాలు ఇచ్చేవారని విమర్శించారు.అప్పటికీ ఇప్పటికి పింఛన్ల పంపిణీలో ఉన్న తేడాను ప్రజలు గుర్తించాలని సూచించారు.ఈనెల 24న జగ్గయ్యపేటలో ప్రతిష్టాత్మకంగా జరగబోయే సామాజిక సాధికార యాత్రకు ప్రతి ఇంటినుంచి తరలిరావాలని ఉదయభాను పిలుపునిచ్చారు.యాత్రను విజయవంతం చేసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.గ్రామాల్లోని నాయకులంతా ఏకతాటిపై ఉండి కార్యకర్తలను సామాజిక సాధికార యాత్రకు నడిపించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
What's Your Reaction?