రేవంత్ కన్నా కేసీఆర్ పాలనే బెటర్
హైదరాబాద్ స్టూడియో భారత్ ప్రతినిధి
రేవంత్ కన్నా.. కేసీఆర్ పాలనే బెటర్..!!
హైదరాబాద్ :
రేవంత్‌రెడ్డి సర్కారు కన్నా గత కేసీఆర్ పాలనే బాగుందని ప్రజలు భావిస్తున్నారని వాయిస్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రా (వోటా) సంస్థ సర్వే తేల్చింది.
రాష్ట్రంలోని 44 శాతం మంది ప్రజలు కేసీఆర్ పాలన బాగుందని చెప్పగా, రేవంత్‌రెడ్డి సర్కారు బాగుందని 35 శాతం మంది అభిప్రాయపడ్డారు. రేవంత్‌రెడ్డి పనితీరుకు ఎన్ని మార్కులేస్తారంటే ఒక్కరు కూడా వంద మార్కులు వేయలేదు. 75 మార్కులేసిన వారు కేవ లం 6 శాతం కాగా, 35 శాతం మంది 50 మార్కులేశారు. అత్యధికంగా 59 శాతం మంది 25 కన్నా తక్కువ మార్కులు వేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా వోటా సంస్థ రాష్ట్రవ్యాప్తంగా శాంపిల్ సర్వేను నిర్వహించింది. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 4 వరకు ఈ సంస్థ ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఆ సర్వే వివరాలను సంస్థ సీఈవో కంభాలపల్లి కృష్ణ బుధవారం మీడియాకు విడుదల చేశారు.
సర్వేలోని కొన్ని అంశాలు..
ఏడాది కాంగ్రెస్ ప్రజాపాలన చెత్తగా ఉందని 12 శాతం, అస్సలు బాగాలేదని 35 శాతం, ఫరవాలేదని 22శాతం మంది అభిప్రాయపడ్డారు. కేవలం 31 శాతం మంది సంతృప్తి వ్యక్తంచేశారు.
ప్రజావాణి దరఖాస్తులు పరిష్కారం కావడంలేదని 23 శాతం చెప్పగా, కొన్ని మాత్రమే పరిష్కారమవుతాయని 34 శాతం, తమకు తెలియదని 27 శాతం, పరిష్కారమవుతున్నాయని కేవ లం 16 శాతం మంది చెప్పారు.
హాట్ న్యూస్ ని చదవండి:- ఉపాధ్యాయుడిని చంపిన విద్యార్థులు - https://studiobharat.com/The-students-killed-the-teacher
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలవుతాయన్న నమ్మకం తమకు లేదని అత్యధికులు అభిప్రాయపడ్డారు. ఆరు గ్యారెంటీలు అమలవుతాయనుకుంటున్నామ ని 14శాతం మంది మాత్రమే చెప్పారు.
కులగణన అవసరమని కేవలం 50 శా తం, అవసరంలేదని 23 శాతం, సర్వే గణాంకాలు బయటికి రావని మరో 18 శాతం మంది అభిప్రాయపడ్డారు.
హైడ్రా తమ ప్రాంతానికి రావొద్దని 43 శాతం మంది చెప్పగా, రావాలని 12 శాతం మంది మాత్రమే చెప్పారు.
మూసీ ప్రక్షాళన వ్యాపారం కోసమని 16 శాతం, ప్రక్షాళనే అవసరం లేదని 15 శాతం, ప్రక్షాళన పూర్తిచేయడం కష్టమని 19 శాతం మంది చెప్పారు.
రేవంత్‌రెడ్డి సోదరులు పాలనలో జోక్యం చేసుకుంటున్నారని 45 శాతం చెప్పగా, మొత్తం పాలన గాడి తప్పిందని 12 శాతం అభిప్రాయపడ్డారు.
కేసీఆర్, కేటీఆర్‌లను అరెస్టు చేయరని 54 శాతం, అరెస్టు చేస్తారని 7శాతం అభిప్రాయపడ్డారు. ఏమైనా జరగొచ్చని మరో 25 శాతం మంది అన్నారు.
సర్వేలో జనం అభిప్రాయాలు
కూరలో ఉప్పులేనట్టు రేవంత్ పాలన ఉంది. రేవంత్ భాషను మార్చుకోవాలి.
రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుండు సున్నా తప్పదు
కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం రేవంత్ తరంకాదు.
కేసీఆర్ ఉంటే ఇప్పటికి రెండుసార్లు రైతుబంధు వచ్చేది.
ధరణి సమస్యలింకా పరిష్కారంకాలే దు. కౌలు రైతులను పట్టించుకోలేదు.
కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలనే రేవంత్ తన ఖాతాలో వేసుకున్నాడు.
తులం బంగారం ముచ్చట తుంగలో తొక్కారు. రేషన్‌కార్డులివ్వకుండా ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం
చివరి రెండేండ్లు భట్టి విక్రమార్కకు ముఖ్యమంత్రి పదవినివ్వాలి.
కేసీఆర్ ప్రజలకు అన్నం పెడితే.. రేవంత్ సున్నం పెడుతున్నాడు.
మార్పు కోసం కాంగ్రెస్‌కు ఓటేస్తే రేవంత్ మాడ పగలగొడుతున్నాడు.
What's Your Reaction?