నిఘా నేత్రాలున్న తెలంగాణకి తరలి వెళ్ళుతున్న ప్రభుత్వ ఉచిత ఇసుక 

ముక్త్యాల స్టూడియో భారత్ ప్రతినిధి

Dec 5, 2024 - 14:19
 0  69
నిఘా నేత్రాలున్న తెలంగాణకి తరలి వెళ్ళుతున్న ప్రభుత్వ ఉచిత ఇసుక 

నిఘా నేత్రాలున్న తెలంగాణకి తరలి వెళ్ళుతున్న ప్రభుత్వ ఉచిత ఇసుక 

ముక్త్యాల 

యన్.టి.ఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాల గ్రామం నుండి ప్రభుత్వ ఉచిత ఇసుక యద్దేచ్ఛగా తెలంగాణ తరలిపోతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.పట్టిష్టమైన నిఘా నేత్రాలు,రెవెన్యూ మరియు సరిహద్దు చెక్ పోస్ట్ ఉన్నప్పటికి జగ్గయ్యపేట రోడ్డులో అగ్రహారం సత్తెమ్మ గుడి వద్ద నుండి ముక్త్యాల గ్రామం వైపు ఉచిత ఇసుక ట్రాక్టర్లలో వెళ్ళుతున్నదని గమనించడం జరిగింది.ఆ ఇసుక ట్రాక్టర్ పందుల ఫాం వద్ద రోడ్డ పై ఆగి ఉన్న లారీ వెనుక ఆపి ఆ లారీ వెంబడి ఉచిత ఇసుక ట్రాక్టర్లు నిఘా నేత్రలు,సరిహద్దు చెక్ పోస్ట్ మీదుగా కోహన్సె కెమికల్ కర్మాగారం దొండపాడు రోడ్డు తెలంగాణ పరిసరాలలోకి రెండు ట్రాక్టర్లు ట్రాక్టర్ల ముందు లోడింగ్ కోసం ఒక్క లారీ తారసబడది.ఈ విషయమై చిల్లకల్లు పోలీసు వారికి,సంబంధిత రెవెన్యూ వార్లకు ఫోన్ ద్వారా సమాచారాని తెలియజేయడం జరిగింది.ఇది షరామామూలే అని ప్రజలు భావిస్తున్నారు.ఈ తతంగం అంత ప్రతి రోజు రాత్రి పగలన్నే తేడా లేకుండా తెలంగాణ రాష్ట్రాన్నికి ప్రభుత్వ ఉచిత ఇసుకని తరలించి అక్రమాలు పెద్దల పేరు చెప్పుకొని సొమ్ము చేసుకుంటున్నారని పలువురు నుండి గుసగుసలు వినిపిస్తున్నాయి.

హాట్ న్యూస్ ని చదవండి:- రేవంత్‌ కన్నా కేసీఆర్‌ పాలనే బెటర్‌ - https://studiobharat.com/KCRs-rule-is-better-than-Revanths

ఇంత జరుగుతున్న ఇసుక తరలింపు వారితో అధికారులు రహస్య ఒప్పందం జరిగినట్లు,వారానికి ఒక్కటి రెండు కేసులు మాత్రమే ఇసుక వాహనాల పై అధికారులు నమోదు చేసుకునేటట్లు ప్రజల నుండి విమర్శలు వినిప్పిస్తున్నాయి.ఇంత తంతు జరుగుతున్న అసలు మైనింగ్ సిబ్బంది ఉన్నారా లేదా అనిపిస్తుంది.స్థానిక అధికారులు మాత్రం ప్రేక్షక పాత్రకే పరిమితం అయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి.ఉచిత ఇసుక పేదలకు అందాలనే ఉద్దేశం సాక్షాతు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలను సైతం అధికారులు పట్టించుకోవడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.ఎవ్వరి వత్తిళ్లు ఉన్నాయో పెరుమాళ కి ఎరుక.తెలంగాణ రాష్ట్రానికి తరలించే ఇసుకను నివారించేది ఎవ్వరు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow