రోడ్డు ప్రమాదాల సంఘటనలో సుప్రీం కోర్టు సంచలన తీర్పు

న్యూఢిల్లీ స్టూడియో భారత్ ప్రతినిధి

Jan 27, 2024 - 21:21
 0  773
రోడ్డు ప్రమాదాల సంఘటనలో సుప్రీం కోర్టు సంచలన తీర్పు

రోడ్డు ప్రమాదాల సంఘటనలో సుప్రీం కోర్టు సంచలన తీర్పు

న్యూఢిల్లీ

భారత్ మరియు రాష్ట్ర ప్రభుత్వాలు,భీమా కంపెనీ సంస్థలు, రోడ్డు రవాణా శాఖ మరియు ప్రభుత్వం సంయుక్తంగా ఏప్రిల్ 1వ తారీఖు 2021 నుంచి ఖచ్చితంగా కఠిన చర్యలతో నిర్ణయాలు అమలు చేయాలని సుప్రీం కోర్టు ప్రధాన జడ్జి ఆదేశించారు.ఆటో లో పరిమితికి మించి (రవాణా శాఖ లెక్క ప్రకారం కాకుండా) ప్రయాణం చేసే సమయంలో ఏదేని ప్రమాదం జరిగితే అందులో ప్రయాణిస్తున్న ఏ ఒక్కరికి ప్రమాద భీమా వర్తించదు.అదే విధంగా ప్రభత్వ పధకాలు ఏవీ వర్తించవు. 

అలాగే ప్రమాదం పాలైన వారికి ఏ విధమైన పరిహారం వర్తించదు.ద్విచక్ర వాహనాల విషయంలో కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి.హెల్మెంట్ లేకుండా వున్న సమయంలో ప్రమాదం జరిగితే ప్రమాద భీమా వర్తించదు. తప్పు మార్గంలో ప్రయాణిస్తూ,ప్రమాదం పాలైతే తప్పు మార్గం లో వస్తున్న వాహనం కాని,వ్యక్తి కి కాని ఏ విధమైన భీమా వర్తించదు.అదే విధంగా సక్రమ మైన మార్గంలో వచ్చే వ్యక్తి పై ఎటువంటి కేసులు ఉండవు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి కూడా ప్రమాదం జరిగితే వారికి ఏ విదమైన భీమా వర్తించదు. రాంగ్ రూట్లలో వచ్చే వారి వల్ల ఇతరులకి ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం చేసిన వ్యక్తి పేరుతో ఉన్న ఆస్తిలో 20 లక్షల రూపాయల ప్రమాదం లో గాయపడిన లేదా మరణించిన వ్యక్తి కి పరిహారం ఇవ్వాలి. 

ఇవ్వలేని పరిస్థితి ఉంటే 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తారు.అదే విధంగా వారి రక్త సంబంధీకుల డ్రైవింగ్ లైసెన్స్ 7 సంవత్సరాల రద్దు చేస్తారు. ఫోన్ మాట్లాడుతూ ప్రమాదం చేస్తే కూడా ఇదే శిక్ష వర్తిస్తుంది. వీరి తరపున ఎవరైనా పైరవీలు చేసినచో వారి డ్రైవింగ్ లైసెన్స్ 5 సంవత్సరం లు రద్దు చేస్తారు. ఈ విషయాలలో కఠిన చర్యలు తీసుకోని అధికారుల విధుల నుంచి 3 సంవత్సరం లు తొలగిస్తారు.ఈ సమయంలో వారికి ఏ విధమైన ప్రభుత్వ పరమైన సహాయం అందదు.అతి వేగంగా వెళ్ళే వారికి కూడా పైన పేర్కొన్న విధంగా శిక్షలు వర్తిస్తాయి. కారు ప్రయాణంలో సీట్ల బెల్ట్స్ పెట్టుకోకుండా వున్నా కూడా ప్రమాదం జరిగితే ఏ విధమైన భీమా వర్తించదు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow