ఏపిలో తెరుచుకున్న అంగన్వాడీ సెంటర్లు.....

ఏపి స్టూడియో భారత్ ప్రతినిధి

Jan 27, 2024 - 07:15
 0  54
ఏపిలో తెరుచుకున్న అంగన్వాడీ సెంటర్లు.....

ఏపిలో తెరుచుకున్న అంగన్వాడీ సెంటర్లు.....

ఏపి లో ప్ర‌తి జిల్లాలో అంగన్వాడీ సెంటర్లు 23 జ‌న‌వ‌రి 2024 (మంగళవారం) నుండి మరల ప్రారంభమైన్నాయి.ఆంధ్ర‌ ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో వారి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె ను చేస్తున్న అంగన్వాడీ సిబ్బందికి ప్రభుత్వం హామీ ఇవ్వడంతో వారు తిరిగి విదులోకి వెళ్ళడం జరిగింది.

రాష్ట్రం వ్యాప్తంగా అంగన్వాడీలు వారి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత 12 డిసెంబర్‌ 2023 నుంచి అంగన్వాడీ కార్యకర్తలు,సహాయకులు సమ్మె బాటపట్టిన సంగతి అందరికి తెలిసిన విషయమే.వారి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు చర్చలు జరిపి సానుకూలత వ్యక్తం చేయడంతో రాష్ట్రంలోని ఐసిడియస్‌ ప్రాజెక్టుల పరిధిలో గల అన్ని అంగన్వాడీ కేంద్రాలు తిరిగి ప్రారంభం కావడంతో లబ్దిదారులకు అందుబాటులోకి వచ్చాయి.

ఈ సందర్భంగా రాష్ట్రంలో గల జిల్లాల వారీగా ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్ అధికారులు ఆయా ప్రాజెక్టుల పరిధిలో గల అంగన్వాడీ వర్కర్లను సమన్వయం చేసుకుని సరుకులు ఏమైనా మిగిలి ఉంటే చెడిపోకుండా వాటిని పంపిణీ చేయాలని సీడీపీఓలకు, సూపర్‌వైజర్లకు ఆదేశించినట్లుగా తెలుస్తోంది.

ఈ సందర్భంగా జ‌న‌వ‌రి 23వ తేదీన‌ (మంగళవారం) జిల్లాల్లోని ప‌లు నియోజకవర్గంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభం కావడంతో చిన్న పిల్లలు,గర్భిణులకు ప్రభుత్వం సరఫరా చేసే పౌష్టికాహారం అందజేస్తున్నారు.

ప్రభుత్వం తరుపున మంత్రి బొత్స సత్యనారాయణ తెలియజేసిన విషయాలు...

☛ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల 11 డిమాండ్లలో 10 పరిష్కారం చేశామని

☛ మరొక డిమాండ్ అయిన జీతాలను జూలైలో జీతాలు పెంచుతామని

☛ వారి ఉద్యోగ విరమణ సమయంలో కార్యకర్తకి ఇచ్చే ప్రయోజనాన్ని 50 వేల నుంచి ఒక్క లక్షా 20 వేల రూపాయలకు పెంచామని 

☛ కేంద్రంలోని హెల్పర్లకు 60 వేలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నాం

☛ వారికి మట్టి ఖర్చులు 20 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని

☛ అంగన్వాడీల సమ్మె కాలానికి జీతాలు ఇస్తామని 

☛ వారి సమ్మె సమయంలో పెట్టిన కేసులు ఎత్తేస్తామని

☛ జీతాల పెంపు పై ఒప్పందాని చర్చల్లో తీసుకున్న నిర్ణయాన్ని మినిట్స్ లో నమోదు చేస్తామని

☛ వారి గ్రాట్యువిటీకి సంబంధించి కేంద్రం నిబంధనలను పాటిస్తామని 

☛ వారి ఉద్యోగ విరమణ వయస్సుని 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచామని 

☛ అంగన్వాడీ రోజువారీ కార్యక్రమాల్లో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నామని 

☛ వైకాపా ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతిని

☛ ఎప్పుడు కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ఆలోచన వైకాపా ప్రభుత్వానికి లేదని 

☛ మినీ సెంటర్లను సైతం అప్ గ్రేడ్ చేస్తామని

ఏపీ అంగన్వాడీ సంఘ నాయకులు తెలిపిన సమాచారం..

 ☛ జీతాలు పెంపు పై నిర్ధిష్ట నిర్ణయంగా జులైలో చేస్తామన్నారు 

☛ అంగన్వాడీ జీతాల పెంపు ఎంత అనేది కూడా రాతపూర్వకంగా ఇస్తామన్నారు

☛ రిటైర్మెంట్ బెనిఫిట్ ను పెంచుతామని హామీ ఇచ్చారు

☛ అంగన్వాడీ డిమాండ్లు నెరవేర్చడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది

☛ అగన్వాడీలకు వైఎస్ఆర్ భీమా ఇస్తామన్నారు

☛ 62 సంవత్సరాలుగా రిటైర్మెంట్ వయసు పెంచుతామని ప్రభుత్వం చెప్పింది

☛ టిఏ బిల్లుల అంశంలో కేంద్రం నుంచి వచ్చే లోపు రాష్ట్రం ఇవ్వడానికి ఒప్పుకుంది

☛ సిఎఫ్ఎంఎస్ తీసేసి సంక్షేమ పధకాలు అంగన్వాడీలకు వర్తింపుచేస్తామన్నారు

► సమ్మె కాలానికి జీతం ఇవ్వడంతో పాటు... కేసులు ఎత్తేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow