శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి సమ్మేత రంగుల మహోత్సవం కార్యక్రమం
పెనుగంచిప్రోలు స్టూడియో భారత్ ప్రతినిధి
శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి సమ్మేత రంగుల మహోత్సవం కార్యక్రమం
పెనుగంచిప్రోలు
ది.01.02.2024 గురువారము ఉ.గం. 5.54 ని.లకు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారు, గోపయ్య స్వామి వార్లు మరియు పరివార దేవతలతో రంగుల ఉత్సవములకు బయలు దేరి జగ్గయ్యపేట కు చేరుకుంటారు.ఈ సమయంలో పెనుగంచిప్రోలు గ్రామములో అమ్మవారు రంగుల మండపము వద్దకు మధ్యాహ్నమునకు చేరుతుంది.అక్కడ నుండి రాత్రి ముందుగా ఎంపిక చేయబడిన 11 ఎద్దుల బండ్లపై దేవతామూర్తులను ఉంచి ఉత్పవముతో బయలుదేరి దారి మధ్యలో ఉన్న తాంబరేణి గార్డెన్/ రైల్వే ట్రాకు వద్ద ఉత్సవము వెంబడి వచ్చిన భక్తులకు, పనివారలకు, ఎద్దులబండ్ల యజమానులకు భోజనము ఏర్పాటుతో రాత్రి గం. 12.00లకు మక్కపేట చేరుతుంది.
రెండో రోజు ది.02.02.2024 స్వామివారు మరియు పరివార దేవతలు జగ్గయ్యపేటలో ఉన్న అమ్మవారి రంగుల మండపము వద్దకు చేరుతారు.
ది:18-02-2024 శ్రీ లక్ష్మి తిరుపతమ్మ అమ్మవారు శ్రీ గోపయ్య స్వామి వారు మరియు వారి పరివార దేవతలకు అలంకారములు చేసి పూజా కార్యక్రమము పూర్తి అయిన తదుపరి ఉదయం గం.05.16 ని.లకు అమ్మవారిని స్వామి వారిని మరియు పరివార దేవతలతో రాజకులు పల్లకీలపై మోయుచు జగ్గయ్యపేట నుండి పల్లకీలలో బయలు దేరి సా, గం.5.00 లకు చిల్లకల్లు గ్రామము నకు చేరుతారు.అక్కడ నుండి రాత్రి గం.8.00 లకు బయలుదేరి భీమవరం అనంతరం తిరిగి బయలు దేరుట 11.00 చేరుతారు.
అమ్మ వారు,స్వామివారు మరియు పరివార దేవతలతో ది.19.02.2024 న సోమవారము తెల్లవారుజామున గం.4.00 లకు బయలుదేరి ఉ.గం.7.00 లకు లింగగూడెం గ్రామమునకు చేరును,లింగగూడెం నుండి సా.గం.3.00 లకు బయలుదేరి రాత్రి గం. 8:00 లకు పెనుగంచిప్రోలు గ్రామములోని శ్రీ అమ్మవారి రంగుల మండపము వద్దకు చేరుతారు. అక్కడ నుండి రాత్రి సుమారు గం. 10.00లకు రథంపై బయలుదేరును. తదుపరి ది.20.02.2024 న ఉ.గం.4.00 లకు శ్రీ స్వామివారు. శ్రీ అమ్మవారు మరియు పరివార దేవతామూర్తులు దేవాలయము నకు చేరుదురు.పై కార్యక్రమములతో అమ్మవారి రంగుల మహోత్సవము పూర్తి అవుతుంది.కె.రమేష్ నాయుడు డిప్యూటీ కలెక్టర్ &కార్యనిర్వహణాధికారి, జె.శ్రీనివాసరావు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి సభ్యులు...
What's Your Reaction?