శ్రీ కోటి లింగ హరిహర మహాక్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా సర్వం సిద్ధం
స్టూడియో భారత్ ప్రతినిధి

శ్రీ కోటి లింగ హరిహర మహాక్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా సర్వం సిద్ధం
ముక్త్యాల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,యన్.టి.ఆర్ జిల్లా,జగ్గయ్యపేట మండలం లో గల ముక్త్యాల గ్రామం లో వేంచేసియున్న శ్రీ కోటి లింగ హరిహర మహాక్షేత్రం మహాశివరాత్రి సందర్భంగా ఆలయాని సిబ్బంది సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
శ్రీ కోటి లింగ హరిహర మహాక్షేత్రం విశిష్టత ...
ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకులుగా ఈశాన్య మూల కోనేటి రాయుడు స్వామి వారు శ్రీదేవి,భూదేవి సతీ సమేతంగా కొలువై ఉన్నారు.
ఈ క్షేత్ర పాలకునికి ప్రధాన అర్చకులు విఖానాసచార్యులు మాట్లాడుతూ .....
కోటి లింగ హరిహర మహాక్షేత్రానికి క్షేత్ర పాలకులుగా కోనేటి రాయుడు స్వామి వారు శ్రీదేవి,భూదేవి సతీ సమేతంగా ప్రతి రోజు భక్తులతో పూజలందుకుంటున్నారన్నారు.ఈ ఆలయానికి అమృత లింగేశ్వర స్వామి,కామాక్షి అమ్మవారు,విజయ గణపతి ప్రధాన స్వామి అమ్మవార్లుగా కొలువుదీరి భక్తులతో పూజలందుకుంటున్నారు.
అమృత లింగేశ్వర స్వామి వారు ఈ క్షేత్రంలో ఐదు అవతారాలతో భక్తులకు దర్శనమిస్తూ,ప్రతి రోజు అభిషేకాలతో పూజలందుకుంటున్నారన్నారు.ఈ క్షేత్రంలో అమ్మవారు కామాక్షి మాతగా దర్శనమిస్తూ,ప్రత్యేకంగా భక్తులతో ప్రతి రోజు కుంకుమ పూజలు నిర్వహించడం జరుగుతుంది.
భక్తులకు విఘ్నాలు తొలగిపోయి,భక్తులకు విజయాలు చేకూరాలని విజయ గణపతి గా పూజలు అందుకుంటున్నారు.ఈ క్షేత్రంలో గణపతి,సుబ్రహ్మణ్య స్వాముల ఆరు అవతారాలతో భక్తులతో ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు.
ఈ క్షేత్రంలో ఇరవై ఆరు అవతార మూర్తులుగా శివుని,అమ్మవార్లు మరియు కోటి లింగాలు,ద్వాదశ జ్యోతిర్లింగాలు,ముఫై రెండు స్వామి వారి ప్రతిష్టలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి.ఈ క్షేత్రంలో నవగ్రహ మండపం,నంది మండపములున్నాయి.
ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు సంగాపు మణికంఠ శ్రీనివాస శర్మ మాట్లాడుతూ ..
ప్రతి రోజు స్వామి వారికి నిత్య అభిషేకాలు,పూజలు,లింగ ప్రతిష్టలు,శాంతి పూజలు,దోష నివారణ పూజలు,యగ్నాలు,హోమాలు, నవగ్రహ పూజలు ఆలయం వారు చేపడం జరుగుతుందని ఆయన తెలియజేశారు.స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన వారికి స్వామి వారి అనుగ్రహం ఎల్లవేళలా అందుతున్నాయని,ఇప్పటికే విదేశీయులు,ఇతర రాష్ట్రాలు, ఆంద్ర తెలంగాణా నుండి భక్తులు విచ్చేసి సుమారు రెండు లక్షల కి పైన లింగ ప్రతిష్టలు వివిధ ప్రత్యేక పూజలు చేయించుకొని స్వామి వారి అనుగ్రహంతో కీర్తి,ప్రతిష్టలు,అష్ట అష్టయిశ్వర్యాలు,ఆయురారోగ్యాలను పొందారని ఆయన అన్నారు.శివరాత్రి సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించడం జరుగుతుందని యావన్మంది భక్తులందరు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలన్నారు.
ఈ క్షేత్రానికి చేరుకోవాలంటే ఆంధ్ర,తెలంగాణ నుండి బస్సు,ఆటోల సౌకర్యాలు కలవు...బస్సు ఆటోలో వచ్చే భక్తులు జగ్గయ్యపేట నుండి పది కిలోమీటర్ల దూరంలో అలకనందనాని ఆనుకొని,కెసిపి సిమెంట్ కర్మాగారం ఎదురుగా కలదు.దూర ప్రాంత భక్తులకు వసతి సౌకర్యం కలదు.
What's Your Reaction?






