నాగబాబు మంత్రి పదవి పై సస్పెన్స్ ఏప్రిల్ వరకు ఆగాల్సిందేనా
స్టూడియో భారత్ ప్రతినిధి
నాగబాబు మంత్రి పదవి పై సస్పెన్స్ ఏప్రిల్ వరకు ఆగాల్సిందేనా
ఇందులో ఒక దాన్ని నాగబాబుకు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.
నాగబాబు మంత్రి పదవిపై సస్పెన్స్ కొనసాగుతోంది. నాగబాబును క్యాబినెట్ లోకి తీసుకుంటామని ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయితే, ఆయన ప్రమాణస్వీకారానికి ఆలస్యం అయ్యే అవకాశం ఉందని సమాచారం. ముందుగా నాగబాబును ఎమ్మెల్సీగా చేసిన తర్వాతే మంత్రిగా చేయాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.దీనికి కారణం కూటమిలో మంత్రి పదవిపైన అత్యధిక మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆశలు పెట్టుకోవడమే. చాలామంది మంత్రి పదవిని ఆశిస్తుండటంతో నాగబాబును ఎమ్మెల్సీగా చేయకుండానే మంత్రిని చేస్తే కొంత అసంతృప్తి రావొచ్చని అధిష్టానం భావిస్తోంది. కూటమిలో బీజేపీ తమకు ఒకే ఒక్క మంత్రి పదవి ఇచ్చారనే అసంతృప్తితో ఉంది.
హాట్ న్యూస్ ని చదవండి :- అంగన్వాడీ 7 నెలల అద్దెల పెండింగ్ లు - అద్దె కిచ్చిన యజమానులు ఖాళీ చేయించే యోచన - https://studiobharat.com/Pending-Anganwadirents-Plan-to-vacate-rent-deprived-owners
దీనికి తోడు జనసేనకు పెద్ద పీట వేస్తున్నారనే అభిప్రాయం కూడా ఉంది. ఇక త్వరలో ఏపీ శాసన మండలిలో నాలుగైదు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవుతాయి.వచ్చే ఏడాది మార్చి 30 తర్వాత 4 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయి.ఇందులో ఒక దాన్ని నాగబాబుకు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆ విధంగా నాగబాబు ఏప్రిల్ లో ఎమ్మెల్సీ అయితే కొత్త తెలుగు సంవత్సరం ఉగాది వేళ మంత్రిగా నాగబాబు ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందంటున్నారు.
What's Your Reaction?