యుక్త వయస్సు వచ్చిన పిల్లల తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త - సామాజిక కార్యకర్త మెటికల శ్రీనివాసరావు
స్టూడియో భారత్ ప్రతినిధి

యుక్త వయస్సు వచ్చిన పిల్లల తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త - సామాజిక కార్యకర్త మెటికల శ్రీనివాసరావు
ప్రపంచంలో భారత దేశం ఎటు పోతుందంటే ప్రతి ఒక్కరు దూసుకుపోతుందని చెప్పుతారు.దానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగ్గయ్యపేట ప్రాంతం ఎటువైపు అంటే.జగ్గయ్యపేట ప్రాంతంలో ఆర్థిక అసమానతలు మరియు భర్తలు లేని వారి మహిళల శాతం ఓటు బ్యాంకే ఎక్కువని అందరికీ తెలిసిందే.ఇటువంటి వారు జగ్గయ్యపేట ప్రాంతంలో ఎక్కువ శాతం అని చెప్పుకోవచ్చు.దీనితో పిల్లల భాధ్యత పట్ల కన్న వారిని పోషించేందుకు వీరు ఎక్కువ శాతం కృషి చేయడంతో పిల్లల్ని జాగ్రత్తలను పట్టించుకునే పరిస్థితులు తక్కువేనని చెప్పుకోవచ్చు.దీనితో 15 సంవత్సరాల వయస్సు నుండి 21 సంవత్సరాల యువకులు చదువు సంధ్యలను వదిలేసి రాజకీయలకు అట్రాక్షన్ అవుతున్నారు.
దీనితో వీరు అవగాహన లేక కోమర దశ పిల్లలు ప్రధానంగా యువకులు చట్ట వ్యతిరేక వ్యసనాలకు అలవాటు పడుతున్నారు.అట్టి వారు సమాజంలో చదువుకుంటున్న యువతులను బుట్టలో పడేస్తున్నారు.దీనితో యువతుల తల్లిదండ్రులు చెడు చట్ట వ్యతిరేక వ్యసనాలకు అలవాటు పడ యువకుల వల్ల యువతుల కుటుంబాలలో కలాలం ఎర్పాడుతుంది.ఇటువంటి చట్ట వ్యతిరేక వ్యసనాల వల్ల యువకులు లైసెన్స్ లేకుండానే ముగ్గురు వ్యక్తులతో బైకులను నడపడం,సైలెన్సర్ పీకీ నడపడం,స్పీడ్ డ్రైవింగ్,అర్థ రాత్రి సైతం మద్యం మత్తులో వాహనాలు నడపడం,గంజాయి, సైకిల్ పంక్చర్ సొల్యూషన్ వాడకం,మత్తు పదార్థాల వ్యసనాలకు అలవాటు పడటం జరుగుతుందని తెలుస్తోంది.అటువంటి చట్ట వ్యతిరేక వ్యసనాలకు అలవాటు పడిన యువత రాత్రి సమయాలల్లో బహిరంగంగానే రోడ్ల వెంబడి గొడవలు పడుతున్న దృశ్యాలు సైతం నిఘా నేత్రాలలో నిక్షిప్తం అవుతున్నాయి.దీనితో పోలీసు ఎవ్వరో ఫోన్ చేయడంతో అట్టి వారిని అదుపులో తీసుకోగానే నాయకుల పలుకుబడితో ఏదొక్కటి చేసి పంపించేస్తున్నట్లు పలువురు బహిరంగంగానే తెలియజేస్తున్నారు.
ఒక్క పక్క ముఖ్యమంత్రి నవ సమాజ స్థాపన కోసం యువత చట్ట వ్యతిరేక వ్యసనాలకు అలవాటు పడకుండా చర్యలు తీసుకునే ప్రయత్నం చేయాలని బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు.ఈ సందర్భంలో జగ్గయ్యపేట ప్రాంతంలో కాలేజీకి వచ్చే సమయంలో మరియు ఇండ్లకు వెళ్ళే సమయంలో విద్యార్థుల కూడలి వద్ద పోలీసులతో ప్రత్యేక పరివేక్షణ చేయాలని,రాత్రి 10 గంటల సమయంలో షాపులను బంద్ చేసిన సమయాలలో రోడ్ల పై విచ్చలవిడిగా వాహనాల పై తిరుగుతున్న యువకులను విచారించి వారిని అదుపులోకి తీసుకొని అట్టి తల్లిదండ్రులకు మొదటి సారి కౌన్సిలింగ్ ఇచ్చి మరోసారి వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని,అదే విధంగా తప్పు చేసిన వారికి నాయకులెవ్వరైన మద్దతు తెలియజేయకుండా ఉండాలని,
ఇప్పటికే 14 సంవత్సరాల పైబడిన యువకుల సర్వే చేపట్టి వారి ప్రాంతంలో చదువు,మంచి లక్షణాల పై ప్రభుత్వం అవగాహన కల్పించి మంచి సమాజ ఏర్పాటు కు ప్రతి ఒక్కరు కృషి చేయాలని,14 సంవత్సరాలు దాటిన తల్లిదండ్రులు పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి భావితరాలకు మంచి పౌరులుగా తీర్చి దిద్దాలని సామాజిక కార్యకర్త మెటికల శ్రీనివాసరావు సమాజంలో ప్రతి ఒక్కరి భాధ్యత ను గుర్తు చేసుకోవాలి తెలియజేశారు.
What's Your Reaction?






