మసీదు వేడుకలో ఏనుగు బీభత్సం

మలప్పురం స్టూడియో భారత్ ప్రతినిధి

Jan 9, 2025 - 06:35
 0  178
మసీదు వేడుకలో ఏనుగు బీభత్సం

మసీదు వేడుకలో ఏనుగు బీభత్సం.. తొక్కిసలాట

మలప్పురం:

కేరళలోని మలప్పురం జిల్లా తిరూర్‌ సమీప మసీదులో నిర్వహిస్తున్న ఓ ఆధ్యాత్మిక వేడుకలో ఏనుగు ఉన్మాదంగా దాడికి పాల్పడటంతో జరిగిన తొక్కిసలాటలో 23 మంది గాయపడ్డారు..

వీరిలో ఏనుగు తొండంతో ఎత్తి గిరాటు వేసిన ఒక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. వేడుక కోసం ప్రత్యేకంగా అలంకరించిన అయిదు ఏనుగులను తెచ్చి వరుసగా నిలబెట్టారు. ఇందులో ఓ ఏనుగు జనసమూహాన్ని చూసి రెచ్చిపోయి గుంపు మీదకు దూసుకుపోయింది. మావటీల ప్రయత్నంతో కాసేపటికి అది శాంతించింది..

ఇది కూడా చదవండి...యుక్త వయస్సు వచ్చిన పిల్లల తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త - సామాజిక కార్యకర్త మెటికల శ్రీనివాసరావు - https://studiobharat.com/beware-of-parents-of-children-who-have-reached-puberty

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow