సంక్రాంతికైన కోడి పందాల ఆటలను పోలీసు పూర్తి స్థాయిలో నివారించేనా

జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి

Jan 13, 2025 - 07:08
 0  59
సంక్రాంతికైన కోడి పందాల ఆటలను పోలీసు పూర్తి స్థాయిలో నివారించేనా

ఈ సంక్రాంతికైన కోడి పందాల ఆటలను పోలీసు పూర్తి స్థాయిలో నివారించేనా!

లేక బరులు ఏర్పాటు చేసి కోడి పందాలను నిర్వహించి పండుగ చేసుకునేనా - వేచి చూడాల్సి ఉంది.

జగ్గయ్యపేట 

జగ్గయ్యపేట నియోజకవర్గం ప్రాంతంలో సంక్రాంతి పండుగ సందర్భంగా సుమారు 15 నుండి 20 ప్రతి యేటా నిర్వాహకులు ఏర్పాటు చేసే ఆనవాయితీ ఉంది.దీనిలో కోట్లలో పలుచోట్ల పదునైన కత్తులు కట్టి హింసతో కోడి పందాలు,పేకాట,మూడు ముక్కలాట,లోనా బైటా,కాయిరాజ కాయి లాంటి ఆటల కోసం బరులు గుడారాలు ఏర్పాటు చేసి సంక్రాంతి మూడు రోజులు ఆడే ఆనవాయితీ ప్రతి సంవత్సరం జరిగుతుందనే బహిరంగంగానే తెలుస్తోంది.కాని ప్రతి యేటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కోడి పందాల బరులను పోలీసులు ధ్వంసం చేస్తున్నారు.మరో వైపు యేటా నిర్వహించేలా కోడి పందాలను నిర్వహించేలా రంగం సిద్ధం చేస్తున్నట్లుంది కోడి పందాల నిర్వాహకులని పలువురు నోటా గుసగుసలు వినిపిస్తున్నాయి.

మసీదు వేడుకలో ఏనుగు బీభత్సం - https://studiobharat.com/Elephant-mishap-in-mosque-ceremony

గ్రామాలలో పలు ప్రాంతంలో కోడి పందాల కోసం కోడ్లను రహస్యంగా ఇప్పటికే పెంచుతున్నట్లు తెలుస్తోంది.డ్రోన్లు సైతం వాటిని గుర్తు పట్టకుండా కోడ్లను రహస్యంగా పెంచుతున్నట్లు ప్రజల నుండి తెలుస్తోంది.పోలీసులు ఎంత శ్రమ పడి కోడి పందాల బరులను ధ్వంసం చేసిన సంక్రాంతి పండగ మూడు రోజులు ఏదో రూపంలో కోడ్లకు కత్తులు కట్టి హింసతో కోడి పందాలను మరియు పేకాట,గుండాట,లోనా బైటా,మూడు ముక్కలాటలు లాంటి చట్ట వ్యతిరేక ఆటలను నిర్వహించే ప్రయత్నాలు చేయడానికి సన్నాహాలు నిర్వాహకులు చేసుకుంటున్నారనే వాదనలు ప్రజల నుండి వినిపిస్తున్నాయి.ఈ సంక్రాంతి కి పోలీసులు కోడి పందాలను,చట్ట వ్యతిరేక ఆటలను నివారించేనా! లేక కోడి పందాల బరులను ఏర్పాటు చేసి ఎప్పటిలాగా కోడి పందాలను ఆడించి నిర్వాహకులు సంక్రాంతి పండుగ చేసుకునేనా వేచి చూడాల్సి ఉంది.మెటికల శ్రీనివాసరావు 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow