పారామౌంట్ వారి ఉచిత స్వర్గపురి సేవలు ఇక మీదట విజయవాడ వరుకు
జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి
పారామౌంట్ వారి ఉచిత స్వర్గపురి సేవలు ఇక మీదట విజయవాడ వరుకు
జగ్గయ్యపేట
పారామౌంట్ వారి నిర్వహణలో స్వర్గపురికి ఉచిత ప్రయాణ వాహనాల సేవలు ఇక పై విజయవాడ వరకు.గత కొన్ని సంవత్సరాలుగా పారమౌంట్ అధినేత వెనిగళ్ళ సురేష్ పారమౌంట్ ఫౌండేషన్ ద్వారా విభిన్న సేవా కార్యక్రమాలు చేస్తూ మానవత్వం చాటుకుంటున్నారు.
వందల కుటుంబాలకు ప్రత్యక్షంగా వేల కుటుంబాలకు పరోక్షంగా పారామౌంట్ ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్య, స్వయం ఉపాధి, ఉద్యోగ పరమైన సహాయ సహకారాలు అందిస్తున్న వెనిగళ్ళ సురేష్ సేవా కార్యక్రమాల్లో భాగంగా మహా ప్రస్థానం సేవలను మరింత విస్తరింప చేసే దిశగా మరొక నూతన వాహనాన్ని అందుబాటులోనికి ఆయన తీసుకువచ్చారు.
మొత్తం మూడు వాహనాల ద్వారా జగ్గయ్యపేట,వత్సవాయి,పెనుగంచిప్రోలు,నందిగామ,వీరులపాడు,జొన్నలగడ్డ,కంచికచర్ల,విజయవాడ వరకు ఉచితంగా మహా ప్రస్థాన వాహన సేవలను విస్తరింప చేశారు.పారామౌంట్ ఫౌండేషన్ ఉచిత మహాప్రస్థానం వాహనం సేవలు కొరకు సంప్రదించవలసిన నెంబర్ 9010009111 ని సంప్రదించగలరు.
What's Your Reaction?