పోలీసు కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటాం సీఎం జగన్
విజయవాడ స్టూడియో భారత్ ప్రతినిధి
పోలీసు కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటాం: సీఎం జగన్
విధి నిర్వహణలో అమరులైన పోలీస్ సిబ్బందికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు.శనివారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
విధి నిర్వహణలో ప్రాణం వదిలిన పోలీస్ కుటుంబానికి ప్రభుత్వం తోడుగా ఉంటుందన్నారు..ఇక,ప్రస్తుత రోజుల్లో నేరం తన రూపాన్ని మార్చుకుంటోందన్న ఆయన..కొత్త టెక్నాలజీ వల్ల సైబర్ సెక్యూరిటీ నుంచి డేటా చోరీ వరకు నేరాలు జరుగుతున్నాయన్నారు.ఈ పరిస్థితుల్లో పోలీసులు అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉందన్నారు.ఫోన్లు,స్మార్ట్ ఫోన్లు,ఇంటర్ నెట్ వాడకం ద్వారా సైబర్ ప్రపంచంలో చీకటి ప్రపంచం సృష్టించుకున్న వారిని ఎదుర్కోవాల్సిన బృహత్తర బాధ్యత పోలీసులపై ఉందన్నారు సీఎం వైఎస్ జగన్..
ఇక,సమాజం కోసం తన ప్రాణాన్ని బలిపెట్టడానికి సిద్ధపడిన యోధుడు పోలీసు..ఖాకీ డ్రెస్ అంటే త్యాగనీరతి అని పోలీస్ ఉద్యోగం ఓ సవాల్ అని పేర్కొన్నారు సీఎం వైఎస్ జగన్..
What's Your Reaction?