శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ తల్లి తిరు తిరుణాల కోలాహలంగా రంగుల మహోత్సవం...
జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి
శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ తల్లి తిరు తిరుణాల కోలాహలంగా రంగుల మహోత్సవం...
భక్తులను ఆకట్టుకున్న దిరిసిన నృత్యం...
జగ్గయ్యపేట
పెనుగంచిప్రోలు శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ తల్లి,పరివార దేవతలు జగ్గయ్యపేట పట్టణంలోని రంగుబజార్ నుండి రంగుల మహోత్సవాని పూర్తి చేసుకొని గద్దెనెక్కటానికి తిరిగి పెనుగంచిప్రోలు దేవస్థానానికి పట్టణ ప్రధాన వీధుల గుండా బయలు దేరారు.ఈ సందర్భంగా భక్తులు కోలాహలంగా స్వామి అమ్మవార్లు,పరివార దేవతలు మేళతాళాలతో,నృత్యాల నడుమ,డప్పు వాయిద్యాలతో తెల్లవారుజామునే జగ్గయ్యపేట పట్టణ ప్రధాన వీధుల గుండా బయలు దేరాటం జరిగింది.
శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ తల్లి,పరివార దేవతలకు పట్టణ ప్రజలు,భక్తులు స్వామి,అమ్మవారికి,పరివార దేవతలకు నిండు కుండాల జలధారలతో,కర్పూర నీరాజనంతో ఘణస్వాగతం పలకడం జరిగింది.భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ తల్లి,పరివార దేవతలను పూజించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్,స్థానిక శాసన సభ్యులు సామినేని ఉదయభాను,పెనుగంచిప్రోలు దేవస్థాన చైర్మన్ జంగాల శ్రీనివాసరావు మరియు పాలకమండలి, డిప్యూటీ కలెక్టర్ మరియు కార్యనిర్వహణాధికారి కె రమేష్ నాయుడు, ప్రముఖ వైకాపా నాయకులు యం సూరారెడ్డి,ఆలయ, పోలీస్, మున్సిపల్ ,108 , ఫైర్ సిబ్బందులు పాల్గొన్నారు.
What's Your Reaction?