శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో రీ టెండర్
జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి
శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో రీ టెండర్
- అన్నిటికీ ఆసక్తి కనపరచని పాట దారులు
వేదాద్రి
యన్.టి.ఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి గ్రామంలో వేంచేసియున్న శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ఆరు పాటలని రీ టెండర్ విధానం ద్వారా దేవస్థానం ఈఓ కానూరి సురేష్ పాటను నిర్వహించారు.ఈ రీ టెండర్ లో ఐదు పాటలకు పాటదారులు ఆసక్తి చూపకపోవడంతో ఆ పాటలను రద్దు చేయడం జరిగింది.కొబ్బరి కాయలు-కిరాణా షాపు కి గత మూడు నెల క్రితం 32 లక్షల 65 వేల రూపాయల పాటను పాడి ఉండగా,ప్రస్తుతం అనంగి ఘంటయ్య 32 లక్షల 70 వేల రూపాయల తో షాపును రీ టెండర్ ద్వారా దక్కించుకున్నారు.ఈ సందర్భంగా కొబ్బరి కాయలు-కిరాణా షాపు గతంలో పాడిన పాటదారుడు మీడియాతో మాట్లాడుతూ పాటను దక్కించుకొన్ని రెండు నెలల కాలంలో 11 లక్షల రూపాయలు నగదును చెల్లించానని,ప్రస్తుతం ఐదు లక్షలు రూపాయల నగదును చెల్లిస్తానని,మిగిలిన మొత్తం 16 లక్షల 65 వేల రూపాయలు నగదును త్వరలో చెల్లిస్తానని చెప్పిన ఈఓ రీ టెండర్ ని పిలిచి మాకు అన్యాయం చేసారని వాపోయాడు.
ఈ విషయమై శ్రీ యోగానంద నరసింహ స్వామి దేవాలయం,వేదాద్రి టెంపుల్ ఇఓ కానూరి సురేష్ గారిని వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ గతంలో పాత పాటదారులు మొత్తం నగదును చెల్లించని కారణంగా,వారికి నోటీసులు ఇచ్చి రీ టెండర్ ని చట్ట ప్రకారమే పిలిచామని ఆయన అన్నారు.కొత్తగా పాడిన వారు మొత్తం నగదును చెల్లించగానే వెంటనే పాడిన షాపును అప్పగించడం జరుగుతుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ ఫణి కుమార్,కెసిపి పర్సనల్ మేనేజర్,ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
What's Your Reaction?