డంపింగ్ యార్డ్ ను తరలించండి - దోనెపూడి శంకర్
జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి
డంపింగ్ యార్డ్ ను తరలించండి - దోనెపూడి శంకర్
జగ్గయ్యపేట
జగ్గయ్యపేట పట్టణం,ముక్త్యాల రోడ్డు,విలియంపేట సమీపంలో గల మున్సిపల్ డంపింగ్ యార్డ్ ను సిపిఐ పార్టీ బృందం పరిశీలించింది.ఈ డంపింగ్ యార్డ్ వల్ల చుట్టుపక్కల ప్రజలు తీవ్ర అసౌకర్యాన్నికి గురౌతున్నారని, డంపింగ్ యార్డ్ లో చెత్తా చెదారాని తగలబెట్టటం మూలానా పొగ మబ్బు కమ్ముకొని వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారని యన్.టి.ఆర్ జిల్లా కౌన్సిల్ జనరల్ కార్యదర్శి దోనెపూడి శంకర్ మున్సిపల్ తీరుని విమర్శించారు.
ఇప్పటికే జగ్గయ్యపేట మున్సిపల్ 31 వార్డుల నుండి ప్రతి రోజు సుమారు 30 టన్నుల పైన చెత్తను సేకరించి,ఈ డంపింగ్ యార్డ్ లో మున్సిపల్ వారు పోస్తున్నారని ఆయన అన్నారు.మున్నిపల్ పాలక పక్షం తడి చెత్త మరియు పొడి చెత్తలను వేరు చేయకుండానే చెత్తను ఈ ప్రాంతంలో పోస్తున్నారని ఆయన అన్నారు.ఇప్పటికే ఇటువంటి చెత్త సేకరణ వల్ల పాలేరు నది కలుషితం అవుతుందని ఆయన అన్నారు.దీనితో ప్రజల ఆరోగ్య సమస్యలపై ప్రభావం పడుతుందని ఆయన అన్నారు.
ఇది కూడా చదవండి... https://studiobharat.com/It-was-her-harassment-that-made-IAS
ప్రజలు కూడా డంపింగ్ యార్డ్ ని తరలించాలని ఆందోళన చేసారని ఆయన మున్సిపల్ వారికి గుర్తు చేశారు.వెంటనే జగ్గయ్యపేట మున్సిపల్ వారు డంపింగ్ యార్డ్ ను ఈ ప్రాంతం నుండి తరలించాలని, లేని పక్షంలో డంపింగ్ యార్డ్ ను తరలించేంత వరకు ప్రజల పక్షాన సిపిఐ పార్టీ ఆందోళన చేస్తుందని ఈ సందర్భంగా ఆయన మున్సిపాలిటీని హెచ్చరించారు.ఈ సందర్భంగా జగ్గయ్యపేట సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి జూనెబోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ పర్యావరణాని కాపాడుదామని మున్సిపల్ తెలియజేస్తూ , పాలేరు నదిని సైతం కలుషితం డంపింగ్ యార్డ్ వల్ల కలుషితం చేస్తూ, పాలేరు లో ఉన్న నీటి బావుల వల్ల పట్టణ ప్రజలకు అందుతున్న త్రాగునీరు కలుషితం అవ్వడంతో నీరు మురుకులు గాను, దుర్వాసన గాను కొన్ని ప్రాంతాలల్లో వస్తున్నాయని ఆయన ఆరోపించారు.
ఇప్పటికైన మున్సిపల్ వారు తడి,పొడి చెత్తలను వేరు వేరుగా సేకరించాలని, ప్రజలకు అసౌకర్యంగా ఉన్న డంపింగ్ యార్డు ను ఊరి దూరంగా తరలించాలని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు పోతుపాక వెంకటేశ్వర్లు, మాశెట్టి రమేష్, భోగ్యం నాగులు,రాణి, మెటికల శ్రీనివాసరావు, షేక్ జాని తదితరులు పాల్గొన్నారు
.
What's Your Reaction?