స్వామి మీ చుట్టు పర్యావరణ ప్రాంతాని కాపాడుకోవడానికి మరో అవతారం ఎత్తాల్సిందే

వేదాద్రి స్టూడియో భారత్ ప్రతినిధి

Aug 8, 2023 - 16:52
Aug 8, 2023 - 17:35
 0  293
స్వామి మీ చుట్టు పర్యావరణ ప్రాంతాని కాపాడుకోవడానికి మరో అవతారం ఎత్తాల్సిందే

యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి మీ చుట్టు పర్యావరణ ప్రాంతాని కాపాడుకోవడానికి మరో అవతారంతో ఎత్తాల్సిందే.

వేదాద్రి

జగ్గయ్యపేట మండల వేదాద్రి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి చుట్టు పక్కల ప్రాంతం అంత కొండలు,గుట్టలతో పచ్చదనం మరియు కృష్ణ నది సైతం స్వామి వారి చల్లని చూపుల నడుమ ఉంది.ఈ ప్రాంతం చుట్టూ వేదాద్రి, రావిరాల,జయంతిపురం,ధర్మవరపాడు తండా మేర కొంత అటవీ భూమితో పాటు,మిగిలినది అడవిని తలపించే కొలతకు అంతుచిక్కని పచ్చదనంతో కొండలు,గుట్టలతో విస్తరించడం జరిగింది.శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు ఏ అవతరంలో ఏ ప్రాంతంలో వెలసిన ఆ ప్రాంతం కొండలు,గుట్టలతో,జంతువులు,పశుపక్ష్యాదులు,పచ్చదనంతో అలలారిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణాని కలిగి స్వామి వారికి ప్రశాంతతో భూ తల్లి స్వాగతం పలుకుతుంది.

స్వామి వారు నివసించే ప్రాంతాలలో సహజంగానే ఆ ప్రాంతం ఖనిజ పదార్థాలను కలిగి ఉంటుంది.అదే కోవలో వేదాద్రి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి చుట్టు ప్రక్కల సుమారు పది కిలోమీటర్ల మేర సున్నపురాయి ఖనిజ సంపద జగ్గయ్యపేట ప్రాంతంలో ఉంది.ఇప్పటికే రాంకో, హేమాద్రి సిమెంట్ కర్మాగారాలు ఈ ప్రాంతంలో ప్రభుత్వ అనుమతులతో సున్నపురాయి త్రవ్వకాలను చేపట్టడం జరుగుతుంది.ఈ ప్రాంతంలో సున్నపురాయి త్రవ్వకాల వల్ల స్వామి వారి ప్రశాంతకి భంగం కలుగుతుందని స్వామి వారి భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇది చాలదంటూ మనిషుల యొక్క స్వార్థం కోసం ఈ ప్రాంతంలో రాంకో సిమెంట్ కర్మాగారం అవసరాల కోసం మరింత సున్నపురాయి త్రవ్వకాలకు అనుమతులను రావిరాల గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణని నిర్వహించారు.

ఇప్పటికే కర్మాగారల ఉత్పత్తి సామర్థ్యం పెంచడం కోసం మరియు కొంత మంది ప్రజలలో , కర్మాగారం యొక్క స్వార్థం,ధనదాహార్తి కోసం యోగ ముద్రలో ఉన్న యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి కి ఇటువంటి తీరుతో భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారని భక్తజనం ఆవేదన వెలిబుచ్చుతున్నారు.భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని సామాజిక కార్యకర్త మెటికల శ్రీనివాసరావు వేదాద్రి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారిని మీ చుట్టు పక్కల ప్రాంతాని స్వామి మీరే మరో అవతారం ఎత్తి కాపాడుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని స్వామి వారిని వేడుకున్నాడు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow