ప్రజల మన్ననలను అందుకుంటున్న పెనుగంచిప్రోలు సర్పంచ్ శ్రీమతి వేల్పుల పద్మ కుమారి 

పెనుగంచిప్రోలు స్టూడియో భారత్ ప్రతినిధి

Aug 8, 2023 - 19:37
 0  97
ప్రజల మన్ననలను అందుకుంటున్న పెనుగంచిప్రోలు సర్పంచ్ శ్రీమతి వేల్పుల పద్మ కుమారి 

ప్రజల మన్ననలను అందుకుంటున్న పెనుగంచిప్రోలు సర్పంచ్ శ్రీమతి వేల్పుల పద్మ కుమారి 

పెనుగంచిప్రోలు

ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచ్ అంటే ఎలా ఉండాలని గెలిచిన తరువాత ఆలోచించేవారే ఎక్కువ మంది ఉన్నారు.పంచాయతీకి అది రాలేదు,ఇది ప్రభుత్వం ఇవ్వలేదనే వారే ఎక్కువ ఉన్నారు.దీనికి భిన్నంగా జగ్గయ్యపేట నియోజకవర్గంలో పెనుగంచిప్రోలు మేజర్ గ్రామపంచాయతీగా సుమారు 20000 పాపులేషన్ తో శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ తల్లి దేవస్థానం ఉంది.సర్పంచ్ గా పెనుగంచిప్రోలు గ్రామ పంచాయతీ కి గెలుపొందినప్పటి నుండి వేల్పుల పద్మకుమారి పలు సందర్భాలల్లో ప్రజల మన్ననలను అందుకుంది.నిరంతరం భర్త అయిన వేల్పుల రవికుమార్ రాజకీయ ఓనమాలు దిద్దుకొని,ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు సామినేని ఉదయభాను వారి కుటుంబ ఆదరాభిమానాలు,ప్రోత్సాహంతో నిరంతరం సర్పంచ్ శ్రీమతి వేల్పుల పద్మకుమారి నిరంతరం ప్రజా సేవలోనే ఉంటున్నారు.

Velpula padma Kumari sarpanch 1

ఇటివల ఈ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు ప్రజానీకం వాటి ఫలితంగా ఏర్పడ్డ వరదలు,వాటి వల్ల సృష్టించిన బీభత్సం వల్ల పెనుగంచిప్రోలు గ్రామ ప్రజల జనజీవనం స్తంభించిపోయింది.ఇటువంటి విపత్తుల నుండి సర్పంచ్ శ్రీమతి వేల్పుల పద్మ కుమారి అధిష్టాన నాయకులు, స్థానిక నాయకుల సూచనల మేరకు ఎన్నడూ లేనివిధంగా వరదలలో చిక్కుకున్న ప్రతి ఒక్క కుటుంబాల వారిని అన్ని విధాలా ఆదుకోవడం జరిగింది.ఇటువంటి సేవా కార్యక్రమాల ద్వారా ఈ ప్రాంత వాసులను ఎంతగానో ఆకట్టుకొని పెనుగంచిప్రోలు గ్రామ పంచాయతీ కి సర్పంచ్ గా శ్రీమతి వేల్పుల పద్మకుమారి మరింత వన్నె తెచ్చిందని ప్రజలు తెలియజేశారు.వరద ఉధృతికి పెనుగంచిప్రోలు లోని రెండు రక్షిత మంచినీటి సరఫరా పథకాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.వాటిలో ఒకదానిని అనేక కష్టాలు వచ్చి సర్పంచ్ ఆధ్వర్యంలో వెంటనే బాగు చేసి తూర్పు వీధి ప్రజలకు త్రాగునీటిని అందించడం జరుగుతున్నది.

Sarpanch

అదేవిధంగా వాటర్ ట్యాంకులకు నిత్యం సరఫరా అయ్యే పెద్ద రక్షిత మంచినీటి పథకానికి కూడా తీవ్రమైన ముప్పు వాటిల్లింది.ఐదు రోజులుగా గ్రామపంచాయతీ సర్పంచ్ వేల్పుల పద్మ కుమారి,కార్యదర్శి శ్యాం కుమార్, ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ సిబ్బంది మొత్తం 7, 8 అడుగుల రూపం నీటిలో ఎన్నో కష్టాలు పడుతూ మున్నేటి నదీ ప్రవాహాన్ని మరల్చుతూ చైన్ జెసిబి తో, ట్రాక్టర్లకు ఆరు ఇంజన్లను బిగించి నీటిని తోడుతూ పైపు లైన్లను మరమ్మత్తు చేసారు.ఏడవ తేదీ రాత్రికి మర మత్తులు పూర్తయి నీటిని వదిలారు.అయితే దురదృష్టవశాత్తు నదీ మధ్య భాగంలో మరొక చోట భారీ వృక్షం కొమ్మ తగిలి పైపులు పగిలిపోయి ఉండగా,వెంటనే గమనించిన సిబ్బంది మరల ఈ రోజు 8వ తారీఖున మరమ్మత్తు పనులు మొదలుపెట్టారు.మున్నేరు కు వచ్చిన భారీ వరదల ఫలితంగా లింగాల వద్ద నుండి నందిగామ వరకు అన్ని రక్షిత మంచినీటి పథకాల పైపులైన్లు దెబ్బతిన్నాయి.

Sarpanch 1

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు సామినేని ఉదయభాను వారి ఆదేశాల మేరకు సర్పంచ్ శ్రీమతి వేల్పుల పద్మ కుమారి వరద ముంపు నుండి ప్రజలను కాపాడేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని చెప్పారు.దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేయడం,ఆర్య వృక్షాలతో చెత్తతో నిండిన కాజ్ వే ను ఒక్క రోజులో బాగు చేసి రాకపోకలను పునరుద్ధరించారని ఆమె తెలియజేశారు.20 వేల జనాభా ఉన్న గ్రామ ప్రజలకు నాలుగు వాటర్ ట్యాంకులతో నిత్యం మంచినీటిని సరఫరా చేశామన్నారు.మరో రెండు రోజుల్లో తప్పకుండా పెనుగంచిప్రోలు గ్రామ ప్రజలకు మంచినీటిని అందిస్తామని ఆమె తెలియజేశారు.అప్పటివరకు ట్యాంక్ ట్యాంకర్ల ద్వారా మంచినీటిని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ప్రోత్సాహంతో తప్పకుండా అందిస్తామని ఆమె అన్నారు.ప్రజా సేవలో నిజాయితీగా పని చేస్తున్న గ్రామపంచాయతీ సిబ్బందికి అధికారులకు,ఎంతగానో సహకరిస్తున్న గ్రామ ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు....

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow