యద్దేచ్చగా సాగుతున్న రియల్ ఎస్టేట్ దందా

స్టూడియో భారత్ ప్రతినిధి

Mar 19, 2025 - 07:10
Mar 19, 2025 - 12:51
 0  309
యద్దేచ్చగా సాగుతున్న రియల్ ఎస్టేట్ దందా

యద్దేచ్చగా సాగుతున్న రియల్ ఎస్టేట్ దందా....

ప్రభుత్వ సి.ఆర్.డి.ఏ ఖజానాకు పంగనామాలు 

జగ్గయ్యపేట 

ఏపి మంత్రి నారాయణ గారు అగ్రికల్చర్ భూమి ఇండ్ల స్థలాలు గా అమ్ముకోవాలంటే ల్యాండ్ కన్వర్షన్,లే అవుట్,సి.ఆర్.డి.ఐ అప్రూవల్స్ తప్పనిసరిగా ఉండాల్సిందేనని ఆయన ప్రచారం చేయడం జరుగుతుంది.మంత్రి గారి మాటలు మాత్రం నీటి వ్రాతలేనని చెప్పుకోవచ్చు.జగ్గయ్యపేట మున్సిపాలిటీ మరియు నియోజకవర్గ ప్రాంతంలోని హైవే వెంబడి సుమారు 5 కిలోమీటర్ల మేర వ్యవసాయ భూములను ప్రభుత్వ అనుమతులు లేకుండానే బహిరంగంగానే ఇండ్ల ప్లాట్ల లను అమ్ముతూ మంత్రి గారి మాటలను మున్సిపల్,పంచాయతీ సిబ్బంది,ప్లానింగ్ అధికారులు ప్రభుత్వ యంత్రాంగం గాలికి వదిలేసి నిద్రపోతున్నట్లు నటిస్తున్నారు.

బహిరంగ మార్కెట్ లో ఒక్క ఎకర ధర సుమారు 20 లక్షల నుండి 50 లక్షల రూపాయల మద్యలో వ్యవసాయ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు రైతుల వద్ద నుండి కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఒక్క ఎకరాలో రోడ్ల క్రింద సుమారు 30 సెంట్ల మరియు ప్రభుత్వ అనుమతుల‌ కొరకు 10 సెంట్ల భూమిని తీసి వేయాల్సి ఉంటుంది.అంటే ఒక్క ఎకరాలలో సుమారు 50 సెంట్ల నుండి 60 సెంట్ల భూమిని మాత్రమే లే అవుట్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ప్లాట్స్ పెట్టుకొని అమ్ముకోవాల్సి ఉంటుంది.దీని ప్రకారం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఒక్క సెంటు సుమారు 35,000 నుండి 85,000 రూపాయలు వ్యవసాయ భూమి కొనుగోలు ధర పడే అవకాశాలు ఉంటుంది.అదే ప్రభుత్వ అనుమతులను తీసుకుంటే ఒక్క సెంటుకి సుమారు 1,25,000 నుండి 2,50,000 రూపాయలు నగదుగా ఉండవచ్చు.కాని బహిరంగ మార్కేట్ లో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా సుమారు 2,00,000 లో నుండి 4,00,000 రూపాయలు మరియు అందినకాడికి ధరలతో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అమ్ముతున్నట్లుగా తెలుస్తోంది.

దీనితో అటు రైతుల వద్ద వ్యవసాయ భూమిని తక్కువ ధరతో కొనుగోలు చేయడమే కాకుండా,ఇటు వినియోగదారుని వద్ద అధిక ధరలతో అమ్మటమే కాకుండా,ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా ప్రభుత్వ ఖజానాకు పంగనామాలు పెడుతున్నారనే చెప్పుకోవచ్చు.రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మాత్రం యద్దేచ్చగా అందరిని మోసం చేస్తూ బహిరంగంగానే ఇండ్ల ప్లాట్ల లను అమ్ముకొని కోట్లు గడిస్తున్నారు.దీని నివారించి ప్రభుత్వ ఖజానాకు నగదు పెంచాల్సిన ప్రభుత్వ యంత్రాంగం మాత్రం పట్టించుకోకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కొమ్ముకాస్తూ వారి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేలా చేస్తూ అధికారులు జోబులు నింపుకుంటున్నారనే పలువురు వాదనలు చేస్తున్నారు.

.

తిరుమలలో ఘనంగా కుమారధార తీర్థ ముక్కోటి - https://studiobharat.com/Kumaradhara-Tirtha-Mukkoti-celebrated-in-Tirumala

ఇప్పటికైన ప్రభుత్వ ఉన్నతాధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వ ఖజానాకు గండిపడకుండా ప్రభుత్వ అనుమతులతో లే అవుట్ లో ప్లాట్ల అమ్మకాలను చేపట్టేలా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.మీ సామాజిక కార్యకర్త మెటికల శ్రీనివాసరావు 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow