చెత్త నుండి సంపదని మున్సిపాలిటీ ఎందుకు సృష్టించలేక పోతుంది
జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి
చెత్త నుండి సంపదని మున్సిపాలిటీ ఎందుకు సృష్టించలేక పోతుంది
జగ్గయ్యపేట
ప్రభుత్వాలు ఎన్ని మారుతున్న జగ్గయ్యపేట పట్టణంలో ఇంటింటికి తడి,పొడి చెత్తల సేకరణకు డబ్బాలు సైతం ఇచ్చి వాటిపై అవగాహనలు ఎన్ని కల్పించిన, వచ్చిన చెత్తను ఏవిధంగా సంపద సృష్టించాలోనని ఎన్ని ఆలోచనలు చేసిన నేటికి జగ్గయ్యపేట మున్సిపాలిటీ వైఫల్యం చెందిందనే చెప్పుకోవచ్చు.మున్సిపాలిటీ సంపద సృష్టించడం సరేగాని, ఓపెన్ డంపింగ్ యార్డ్ వల్ల పర్యావరణం దెబ్బతినటమే కాకుండా,చుట్టుపక్కల ప్రజల ఆరోగ్యాలు పాడవటమే, పాలేరు లాంటి నది సైతం కలుషితం అవుతుందని,చెత్తా చెదారం తగలబెట్టడం మూలానా వచ్చే పొగ వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
చెత్త నుండి సంపద సృష్టించడం మరిచిన మున్సిపాలిటీ
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తడి,పొడి చెత్తల నుండి సేంద్రియ ఎరువును తయారుచేసి తద్వారా సంపద సృష్టించడం కోసం ప్రయత్నాలు చేపట్టి ఆదిశగా అడుగులను వేసింది ప్రభుత్వం.కానీ జగ్గయ్యపేట మున్సిపాలిటీ పాలకమండలి మాత్రం ఆదిశగా ఆలోచించకపోవడం బాధాకరం.కొన్ని నెలల క్రితం సచివాలయాల నుండి ప్రతి ఇంటికి చెత్త సేకరణ కోసం రూ 30 నుండి రూ 60 వరకు రెండు నెలల పాటు జగ్గయ్యపేట మున్సిపాలిటీ వసూలు చేసిన అందరికి తెలిసిందే.సచివాలయ,వాలంటరీ వ్యవస్థ బలంగా ఉన్నప్పటికీ ఇంటింటికి వచ్చి చెత్త సేవకరించే దానిలో తడి,పొడి చెత్తలను విడివిడిగా సేకరించకపోవడం,చెత్త నుండి సంపద సృష్టించడంలోను జగ్గయ్యపేట మున్సిపాలిటీ పూర్తిగా వైఫల్యం చెందిందనే చెప్పుకోవచ్చు.
పర్యావరణం,పాలేరు నది సైతం కలుషితం
ఇప్పటికైన జగ్గయ్యపేట మున్సిపాలిటీ ఓపెన్ గా చెత్త డంపింగ్ యార్డ్ వల్ల ప్రజలలో వస్తున్న వ్యతిరేకత మరియు రోడ్డు పక్కన పోస్తున్న చెత్తాచెదారాని దృష్టిలో పెట్టుకొని,డంపింగ్ యార్డ్ ను పట్టణానికి దూరంగా తరలించాలని,దీనిలో ఇప్పటికైన భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని సంపద సృష్టించడం కోసం షెడ్లను ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.ఆ దిశగా జగ్గయ్యపేట మున్సిపల్ పాలక, ప్రతిపక్షాలు ఆలోచిస్తే సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుందని మేధావులు తెలియజేస్తున్నారు.మరి జగ్గయ్యపేట మున్సిపల్ వారు ఏమి చేస్తారో వేచి చూడాల్సిందే.మీ సామాజిక కార్యకర్త మెటికల శ్రీనివాసరావు
What's Your Reaction?