అధిక ధరలపై మహిళా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన
కామారెడ్డి స్టూడియో భారత్ ప్రతినిధి
అధిక ధరలపై కామారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మరియు మాజీ మంత్రివర్యులు మహమ్మద్ అలీ షబ్బీర్ మరియు టీపీసీసీ మహిళ అధ్యక్షురాలు సునీత రావు ల ఆదేశాల మేరకు కూరగాయలు ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తుంది.
తెలంగాణ ప్రజలతో ఆడుకుంటున్న ఈ రెండు ప్రభుత్వాలను వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాము.రెక్క ఆడితే కానీ డొక్కాడని సామాన్య ప్రజలకు కూరగాయల అధిక ధరల వలన అల్లం,ఎల్లిగడ్డ కూడా 200 రూపాయలు దాటిన పరిస్థితి,మిర్చి కిలో 180,టమోటా 140 కిలో, ఏ కూరగాయలు తీసుకున్న 80 రూపాయలకు తక్కువ కాకుండా ఉన్నాయి.
ఇది కూడా చదవండి...https://studiobharat.com/India-won-the-SAP-title-for-the-ninth-time
అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ధరలు 20 రూపాయలు ఉన్న ఘనత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంది.అందు కొరకు ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఇంత రేటు కొండెక్కిన గాని పట్టించుకోకుండా సామాన్య ప్రజలను నడ్డి విరుస్తూ,ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వెంటనే వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని తెలంగాణ ప్రజలందరినీ మనవి చేస్తున్నాము.ఈ కార్యక్రమంలో పాల్గొన్న కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళ అధ్యక్షురాలు పాక జ్ఞానేశ్వరి రవి ప్రసాద్ మరియు పట్టణ అధ్యక్షురాలు సుమ ప్రియ,ఫరీదా,నాగరాణి,రమ,మంజుల తదితరులు పాల్గొనడం జరిగినది.
What's Your Reaction?